top story: Will you leave? Do you want to drive me out? Trump's warning to Indians
Top story: మీరెళ్లిపోతారా.? నన్ను తరిమేయమంటారా.? ఇండియన్స్ కి ట్రంప్ వార్నింగ్.!
మీరెళ్లిపోతారా… నన్ను తరిమేయమంటారా…? అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇది. పవర్ చేతిలోకి రాకముందే పవర్ ఫుల్ డైలాగులతో వలసదారుల గుండెల్లో బాంబులు పేలుస్తున్నారు ట్రంప్.
మరి ట్రంప్ ఫస్ట్ టాస్క్ ఇదేనా…? ఇక వలసదారులు అమెరికా నుంచి పారిపోవాల్సిందేనా…? మన భారతీయులకూ ఇబ్బందులు తప్పవా…?
అసలే ఆయన ట్రంప్… ఎదైనా అనుకున్నారంటే అది అయిపోవాల్సిందే. మాములుగానే ఆయనతో మామూలుగా ఉండదు… ఇక తనను గెలిపించిన వలసదారుల తరిమివేత అంశంలో ఆయన ఊరుకుంటారా…? ఇప్పటికే ఆయన తన ప్లాన్ మొదలుపెట్టేసినట్లు కనిపిస్తోంది. అధికారానికి ఇంకా రెండు నెలలకు పైగానే టైమున్నా ఇప్పట్నుంచే వలసదారుల గుండెల్లో మిస్సైళ్లను బలంగా పేలుస్తున్నారు.
వలసదారుల కంటే ముందు భారతీయుల గుండెల్లో ట్రంప్ మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి రాగానే ఫస్ట్‌డేనే నాచ్యురలైజ్డ్ సిటిజన్‌షిప్‌పై పడనున్నారు. అంటే ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం అమెరికాలో ఎవరైనా పుడితే సహజంగానే వారు ఆ దేశ పౌరులైపోతారు. తల్లితండ్రి ఎక్కడివారు అన్నదాంతో సంబంధం లేదు. అమెరికా గడ్డపై పుడితే చాలు ఆ దేశ పౌరుడైపోతారు. చాలామంది విదేశీయులు అమెరికాలో పిల్లల్ని కనడానికి అందుకే ఉత్సాహం చూపేవారు. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఆ రూల్‌ను పక్కన పెట్టబోతున్నారు. తల్లి లేదా తండ్రిలో ఒకరు కచ్చితంగా అమెరికా జాతీయుడు లేదా చట్టబద్దంగా అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలన్న రూల్ తీసుకు రాబోతున్నారు. మన భారతీయుల్లో ఎక్కువ మంది ఉద్యోగాల కోసం అమెరికాలో ఉంటూ అక్కడే పిల్లల్ని కనేవారు. దీంతో వారు అమెరికా పౌరులై పోయేవారు. ఒకవేళ్ల తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ రాకపోయినా డిపెండెంట్ హోదాలో అమెరికాలో ఉండటానికి పెద్దలకు అవకాశం ఉండేది. చాలామంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం అప్లయ్ చేసుకున్నా వారి జీవితకాలంలో అది అందడం లేదు. అమెరికాలో ఇప్పటికి దాదాపు 10లక్షలమందికి పైగా భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారందరికీ ఈ నాచ్యురలైజ్డ్ సిటిజన్ షిప్ వరంలా ఉండేది. కానీ ట్రంప్ దానికి గండి కొట్టబోతున్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అమెరికాలో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని కన్నా ఉపయోగం ఉండదు. ఇది భారతీయులను దెబ్బతీసేదే. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తానని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఇది అమెరికా రాజ్యంగంలోని 14వ అధికరణకు వ్యతిరేకం అన్నది నిపుణుల మాట. దీనిపై న్యాయపోరాటాలు జరిగే అవకాశం ఉంది. అయినా సరే అక్కడ ఉన్నది ట్రంప్. ఆయన ఏం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక అధ్యక్షుడుగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ చేయబోయే మరో పని వలసదారులను తరిమేయడం. ఇమ్మిగ్రెంట్స్ గెటవుట్ పాలసీపై ఫోకస్ పెడతానని ఇప్పటికే స్పష్టం చేశారు ట్రంప్. దేశంలోకి అక్రమంగా చొరబడిన వారి పని పట్టేందుకు ప్లాన్ ఇప్పటికే రెడీ అయ్యింది. అధికార పీఠం ఎక్కగానే నేషనల్ ఎమర్జెన్సీ విధించాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్రమ వలసవాదులను దేశం నుంచి తరిమికొట్టేందుకు అవసరమైతే మిలిటరీని ఉపయోగించాలని ట్రంప్ భావిస్తున్నారు. ముందుగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటానికి అవకాశం ఉన్న వారిని దేశం నుంచి పంపించి వేస్తారు. ఆ తర్వాత మిగిలిన వారి పనిపడతారట. దేశంలో ప్రతి ఇంటి తలుపు కొట్టి అక్రమ వలసదారుల సంగతి తేలుస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ట్రంప్. ఆయన గెలుపుకు దోహదం చేసింది ఆ అంశమే. అందుకే ముందుగా దాన్ని నెరవేర్చాలన్నది ట్రంప్ ఆలోచన. మాజీ ఐసీఈ డైరెక్టర్ టామ్ హామన్‌కు ఈ డిపోర్టేషన్ పని అప్పగించబోతున్నట్లు ప్రకటించారు. వలసదారుల విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారన్న పేరుంది. ముఖ్యంగా మెక్సికో బోర్డర్‌లో పరిస్థితి దారుణంగా మారే అవకాశాలున్నాయి. ట్రంప్ కఠిన విధానాలు అవలంభిస్తే అది మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని మేథావులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ట్రంప్ ఎలాగైనా వారిని వెనక్కు పంపించాల్సిందేనన్న కఠిన నిర్ణయంతో ఉన్నారు.
మొత్తానికి అధికారంలోకి రాకుండానే ట్రంప్ తన నిర్ణయాలతో బాంబులు పేలుస్తున్నారు. ఇక పవర్ చేతికొచ్చాక ఇంకెన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి…!
0 Response to "top story: Will you leave? Do you want to drive me out? Trump's warning to Indians"
Post a Comment