Union Budget 2024
Union Budget 2024: సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు.. ఇక పండగే!
కొత్త బడ్జెట్ వస్తుందంటే అన్ని వర్గాలు తమకు అనుకూల నిర్ణయాలు ఉంటాయని ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు డబ్బు ఆదా చేసే ప్రకటనలు ఉంటాయని ఆశ పడుతుంటారు.
2024 సంవత్సరం త్వరలోనే ముగియనుంది. అప్పుడే కొత్త బడ్జెట్ అంచనాలు, చర్చలు మొదలైపోయాయి. రాబోయే బడ్జెట్‌లో పన్ను రాయితీల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కొన్ని సూచనలు చేశారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలో మధ్య తరగతి పన్ను చెల్లింపుదారుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ప్రజా సమస్యలపై ఆమె ఇటీవలి స్పందిస్తూ, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ఆర్థిక ఇబ్బందులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పన్ను మినహాయింపుపై మధ్యతరగతి ఆశలు
మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఓ ట్యాక్స్ పేయర్ ఇటీవల చేసిన సోషల్ మీడియా రిక్వెస్ట్ ఈ అవసరాన్ని మరోసారి హైలైట్ చేసింది. 'మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పరిస్థితులను, సవాళ్లను నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది హృదయపూర్వక విజ్ఞప్తి.' అని పోస్ట్ చేశాడు.
ప్రభుత్వం ఎలా స్పందించింది?
ప్రత్యుత్తరంగా నిర్మలా సీతారామన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలోచనాత్మకమైన మెసేజ్ షేర్ చేశారు. 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యత, శ్రద్ధగలది. మేము ప్రజల అభ్యర్థనలు, ఆందోళనలు వింటాం. వాటిని తప్పకుండా శ్రద్ధగా పరిశీలిస్తాం. మీ అవగాహన, సూచనలకు ధన్యవాదాలు' అని పేర్కొంది.
పన్ను సంస్కరణల దశాబ్దం
మోదీ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లుగా సంవత్సరానికి రూ.20 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తులపై పన్నులు తగ్గాయి. ఉదాహరణకు, ప్రభుత్వ డేటా ప్రకారం, రూ.10 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వారి చెల్లించే పన్ను 2014లో 10.17% నుంచి 2024లో 6.22%కి పడిపోయింది.
రానున్న బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?
ఇంకా బడ్జెట్ నిర్ణయాలు ప్రకటించనప్పటికీ, తదుపరి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు సహాయపడే చర్యలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పన్ను భారాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్ను శ్లాబులను సర్దుబాటు చేయడం. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం వంటివి మరిన్ని పన్ను ఆదా చేసుకునే అవకాశాలు అందిస్తాయి. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం, జీవన వ్యయాలను తగ్గించడం ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
మధ్యతరగతి ప్రజలు ఆర్థిక కష్టాలను గుర్తించామని ఆర్థిక మంత్రి చెప్పడాన్ని సానుకూల సంకేతంగా చూస్తున్నారు. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రాబోయే బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఉపశమనం, సహకారం అందించే ప్రకటనల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 25 ట్యాక్స్ శ్లాబ్‌లు
2024-25 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానంలో కొత్త ట్యాక్స్ శ్లాబ్‌లు ఇవే.
రూ.3,00,000 వరకు: నిల్
రూ.3,00,001 నుంచి రూ.6,00,000: 5%
రూ.6,00,001 నుంచి రూ.9,00,000: 10%
రూ.9,00,001 నుంచి రూ.12,00,000: 15%
రూ.12,00,001 నుంచి రూ.15,00,000: 20%
రూ.15,00,000 పైన: 30%
0 Response to "Union Budget 2024"
Post a Comment