Aadhaar Card Update
Aadhaar Card Update: ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ మార్చుకోవాలా? సింపుల్ గా ఈ టిప్స్ ఫాలోఅవగలరు.
కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులు అందరికీ ఆధార్ కార్డును అందజేసింది. 12 అంకెలతో కూడిన ఈ ఆధార్ కార్డును ముఖ్యమైన గుర్తింపు డాక్యమెంట్ గా ఉపయోగిస్తున్నారు.
బయోమెట్రిక్స్, అడ్రస్ ప్రూఫ్, ఫొటోతో సహా ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు ఈ ఆధార్ కార్డులో ఉంటాయి. ఈ గుర్తింపు ప్రక్రియను మరింత ఈజీ చేసేందుకు UIDAI మొబైల్ నంబర్ తో ఆధార్ ను లింక్ చేయాడాన్ని తప్పనిసరి చేసింది.
మొబైల్ నంబర్ ను ఎలా మార్చుకోవాలో వివరణ
ఒక్కోసారి మన మోబైల్ నెంబర్ ఆధార్ కు లింక్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కచ్చితంగా ఆధార్ తో మొబైల్ నెంబర్ ను లింక్ చేయాలి. అటు UIDAI కూడా ప్రస్తుతం ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. డిసెంబర్ 14 వరకు ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, సహా ఇతర వివరాలను ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. బయోమెట్రిక్, ఐరిష్, ఫోటో మినహా మిగతా అప్ డేట్స్ ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు. అయితే, ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాలంటే, మోబైల్ నెంబర్ తో లింక్ చేసుకోవాలి. ఇంతకీ ఆధార్ కార్డులో మోబైల్ నెంబర్ ను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డులో మోబైల్ నెంబర్ ను ఇలా ఈజీగా మార్చండి!
- ఆధార్ అధికారిక వెబ్ సైట్ UIDAIలోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో 'గెట్ ఆధార్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత 'బుక్ అపాయింట్ మెంట్' మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత నెక్ట్స్ పేజీలో మీ పట్టణం లేదంటే నగరం పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ పై కనిపించే సూచనలను ఫాలో కావాలి.
- మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి క్యాప్చాను టైప్ చేయాలి.
- ఆ తర్వాత 'జెనరేట్ ఓటీపీ' అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది.
- మీ ఆధార్ నంబర్, పూర్తి పేరు, అప్లికేషన్ వెరిఫికేషన్ రకం, సిటీని ఎంచుకోవాలి.
- ‘సర్వీసును ఎంచుకోండి' దగ్గర 'మోబైల్ నెంబర్ అప్ డేట్'ను సెలెక్ట్ చేసుకోవాలి.
- కొత్త నెంబర్ ను ఎంటర్ చేయాలి. పూర్తి వివరాలను సబ్ మిట్ చేయాలి.
- ఫారమ్ ను సమర్పించిన తర్వాత, రూ. 50 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. (డిసెంబర్ 14 వరకు ఫ్రీగా అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది).
- ఫీజు చెల్లించిన తర్వాత మీరు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని కలిగి ఉన్న స్లిప్ వస్తుంది. ఇది మీ మోబైల్ నెంబర్ అప్ డేట్ స్టేటస్ ను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
- కొద్ది రోజుల్లోనే మీ మోబైల్ నెంబర్ అప్ డేట్ అవుతుంది.
0 Response to "Aadhaar Card Update"
Post a Comment