Abolition of 'no detention policy' in classes 5 and 8
5, 8 తరగతుల్లో ‘నో డిటెన్షన్ విధానం' రద్దు
- విద్యా హక్కు చట్టానికి సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం
- ప్రాథమిక విద్యపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకే.
ప్రాథమిక విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 5, 8 తరగతులకు 'నో డిటెన్షన్ పాలసీ'ని రద్దు చేసింది. దీని ప్రకారం ఈ రెండు తరగతులకు చెందిన విద్యా ర్థులు.. పై తరగతులకు వెళ్లేందుకు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పరీక్షల్లో పాస్ అయినా.. ఫెయిల్ అయినా హాజరు శాతంతో విద్యా హక్కు చట్టం ప్రకారం పై తరగతులకు పంపిస్తు న్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సాధారణ పరీక్షల్లో విద్యార్థి అనుత్తీర్ణులైతే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. పరీక్షల ఫలితాలు వెలువడే తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష పెడతారు. ఒకవేళ రెండోసారి రాసే పరీక్షల్లోనూ అనుత్తీర్ణులైతే వారు5,8 తరగతులే మళ్లీ చదవాల్సి ఉంటుంది. ఈ సమ యంలో విద్యార్థి, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు మార్గదర్శకం చేయాలి. మదింపులో వివిధ స్థాయిలో గుర్తించిన అభ్యసన అంతరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించాలి. ఈ విద్యార్థుల పురోగతిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. పిల్లలకు నిర్వహించే పరీక్ష పునఃపరీక్షలు వారి సమగ్రాభివృద్ధి సాధించేందుకు సామర్థ్య ఆధారంగా ఉండాలి. జ్ఞాపకశక్తి, విధాన పరమైన నైపుణ్యాలపై ఆధా రపడి ఉండకూడదు. అయితే, ప్రాథమికోన్నత విద్య పూర్తయ్యే వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాథమిక విద్య రాష్ట్ర జాబితా లోని అంశమైనందునా ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆ ప్రభుత్వం పరిధిలోని దాదాపు 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే దిల్లీ సహా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8 తర గతుల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి.
0 Response to "Abolition of 'no detention policy' in classes 5 and 8"
Post a Comment