Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Did your valuables fall off the train? No tension.. will it reach your address if you do this?

 Indian Railways: ట్రైన్‌లోంచి మీ విలువైన వస్తువు పడిపోయిందా? నో టెన్షన్‌.. ఇలా చేస్తే మీ అడ్రస్‌కు వస్తుంది?

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏది అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచంలో భారత రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది వివిధ రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

అయితే ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైల్వేలో కొన్నింటి గురించి అందరికి తెలియవు. ప్రతి సమస్యకు పరిష్కారం అందించే విధంగా నిబంధనలను రూపొందించింది రైల్వే. మీరు రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా ఫోన్‌లు, పర్సులు, ఇతర వస్తువులను పడిపోవడం చూస్తుంటాము. చాలాసార్లు అజాగ్రత్త కారణంగా ప్రయాణిస్తున్నప్పుడు రైలు నుంచి మొబైల్, పర్సు, వాచ్ వంటి విలువైన వస్తువులు పడిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. కానీ ఇలాంటి సమయంలో ట్రైన్‌ నుంచి ఏదైనా వస్తువు పడిపోయినట్లయితే ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం ఉండదు. మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే మార్గం గురించి తెలుసుకుందాం.

వెంటనే ఈ పని చేయండి

ఏ కారణం చేతనైనా మీ మొబైల్ ఫోన్ లేదా పర్స్ రైలు నుండి పడిపోయినట్లయితే, ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో రాసి ఉన్న నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ట్రాక్‌ పక్కన ఇలా పనుసు రంగుల్లో ఉండే ఓ పోన్‌ ఉంటుంది. ఆ స్థంభంపై ఉన్న నంబర్‌ను గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం. తర్వాత దీని కోసం మీరు మీ స్నేహితుడి లేదా రైల్లో ఉన్న ఇతర ప్రయాణికుల ఫోన్‌ను తీసుకుని 139 నంబర్‌ లేదా 182 నంబర్‌కు కాల్‌ చేయాలి. ఈ కాల్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ డెస్క్‌ సిబ్బందికి వెళ్తుంది. అక్కడి సిబ్బందికి మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి సమాచారం అందించాలి. అలాగే మీరు నోట్‌ చేసుకున్న పోల్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి. అలాగే సిబ్బందికి మీ అడ్రస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

మీ వస్తువు పడిపోయిన ప్రాంతంలో పోల్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల పడిపోయిన వస్తువు కనుగొనడంలో సహాయపడుతుంది. పోల్ నంబర్ సహాయంతో, పోలీసులు మీరు పేర్కొన్న ప్రదేశానికి చేరుకుంటారు. మీ మొబైల్ ఫోన్, పర్సు లేదా వాచ్‌ని గుర్తిస్తారు. వస్తువులను కనుగొని వాటిని తిరిగి ఇస్తామని మాత్రం పోలీసులు హామీ ఇవ్వరు కానీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లే లోగా ఆ వస్తువు అలాగే ఉంటే వేతికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. సిబ్బంది వెళ్లే వరకు ఎవరికైనా పోగొట్టుకున్న వస్తువు దొరికితే వారు ఏం చేయలేరని గుర్తించుకోండి. ఒక వేళ రైల్వే సిబ్బంది అక్కడికి వెళ్లేవరకు ఎవరు తీసుకోకుంటే దానిని మీ అడ్రస్‌కు కొరియర్‌ చేస్తారు. ఇదిలా ఉండగా, ప్రతి సంవత్సరం చాలా మంది ప్రయాణికులు ఇలా అధిక సంఖ్యలో తమ వస్తువులను పోగొట్టుకుంటున్నారని రైల్వే చెబుతోంది. రికవరీ చాలా కష్టమైన పని.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Did your valuables fall off the train? No tension.. will it reach your address if you do this?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0