Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 If you pay Rs.50, you will get a new PAN card at home.. Apply like this.. Simple process!

 రూ.50 చెల్లిస్తే మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్.. ఇలా అప్లై చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్!

If you pay Rs.50, you will get a new PAN card at home.. Apply like this.. Simple process!

భారత్‌లో ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుడికి పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేతి తప్పనిసరైన డాక్యుమెంట్. ఆదాయపు పన్ను, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన గుర్తింపు.

ట్యాక్స్ పేయర్లతో పాటు రూ.50 వేలకు మించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు సైతం పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది పాన్ కార్డు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాజెక్టులో భాగంగా క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డు ప్రింటింగ్ మొదలు పెట్టింది. ట్యాక్స్ పేయర్లు ఇప్పుడు తమ పాన్ కార్డు రీప్రింట్ కోసం అప్లై చేసుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీరు క్యూఆర్ కోడ్‌తో ఉండే కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కేవలం రూ.50 చెల్లిస్తే మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్ పోస్టు ద్వారా వస్తుంది. పాన్ కార్డ్ రీప్రింటింగ్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ గైడ్, వివరాల్లో మార్పులు, జారీ చేసే సంస్థ వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎన్ఎస్డీఎల్ ద్వారా పాన్ కార్డ్ రీప్రింట్ ప్రాసెస్..

  • ముందుగా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లోకి వెళ్లి అందులో పాన్ రీప్రింట్ పేజీలోకి వెళ్లాలి.
  • మీ పాన్ కార్డ్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి టిక్స్ బాక్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.
  • స్క్రీన్ పై కనిపించే వివరాలను చెక్ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ఓటీపీ కోసం జనరేట్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  • అప్పుడు మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • పాన్ కార్డ్ రీప్రింట్ కోసం రూ.50 చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారానే చెల్లించవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్ రిసిప్ట్ వస్తుంది. దీనిని భద్రపరుచుకోవాలి.
  • 15-20 రోజుల్లో మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి కొత్త పాన్ కార్డు డెలివరీ అవుతుంది.
  • అలాగే అప్లై చేసిన 24 గంటల తర్వాత ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లో ఇ-పాన్ అందుబాటులో ఉంటుంది. దానిని సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూటీఐఐఎస్ఎల్ ద్వారా పాన్ రీప్రింట్ ప్రాసెస్

ముందుగా యూటీఐఐటీఎస్‌ఎల్ వెబ్‌సైట్లో పాన్ రీప్రింట్ పేజీలోకి వెళ్లాలి. రీప్రింట్ పాన్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్, డెట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. పేమెంట్, ఓటీపీ వాలిడేషన్ వంటి ప్రాసెస్ ఫాలో కావాలి. ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లో మాదిరిగానే ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేస్తే మీకు రీప్రింట్ అయిన కొత్త పాన్ కార్డ్ ఇంటికి వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " If you pay Rs.50, you will get a new PAN card at home.. Apply like this.. Simple process!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0