Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Phone Next To Head

 Phone Next To Head : ఫోన్‌ను తల పక్కన పెట్టి పడుకుంటున్నారా.. ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు.

Phone Next To Head

స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి తరుణంలో మన దైనందిన జీవితంలో ఎలా భాగమయ్యాయో అందరికీ తెలిసిందే. అవి లేకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం.

ఎంటర్‌టైన్‌మెంట్ మొదలుకొని అనేక పనులను మనం ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నాం. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా వాటి వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలను మనం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా.. చాలా మంది నిద్రించేటప్పుడు తమ తల పక్కనే లేదా దిండు కింద ఫోన్లను పెట్టి నిద్రిస్తున్నారు. అది మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్లు సాధారణంగా 900 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. వాటిల్లో ఉండే రిసీవర్ ఆ ఫ్రీక్వెన్సీతో కాల్స్‌ను స్వీకరిస్తుంది. అలాగే మనం కాల్స్ చేసినా అదే ఫ్రీక్వెన్సీతో వెళ్తాయి. అయితే సాధారణంగా పగలంతా ఫోన్ మనతోనే ఉంటుంది. ఇక రాత్రి పూట కూడా మన శరీరం పక్కనే, అందులోనూ ముఖ్యంగా తల పక్కన ఫోన్‌ను పెడితే దాని ద్వారా వెలువడే రేడియో తరంగాలు మనకు హాని చేస్తాయి. ఆ తరంగాల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మన మెదడుపై ప్రభావం పడి అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.

నిద్రించేటప్పుడు ఫోన్‌ను తలపక్కన పెట్టి పడుకుంటే దాన్నుంచి వచ్చే రేడియేషన్‌తో నిద్రలేమి, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల పక్కన ఫోన్‌ను పెట్టుకునే పనైతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టాలని, అదే కాల్స్ వస్తాయని అనుకుంటే ఫోన్‌ను దూరంగా పెట్టి నిద్రించాలని వైద్యులు చెబుతున్నారు. ఫోన్‌ను తల పక్కన పెట్టి నిద్రించడం వల్ల డిప్రెషన్‌, ఒత్తిడి, ఇతర మానసిక వ్యాధులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందని, కనుక ఆ పనిచేసే వారు ఇకనైనా దాన్ని మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Phone Next To Head"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0