Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Scholarship
Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీఎం యూఎస్పీ స్కాలర్ షిప్ కింద రూ.82 వేలు.
Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Scholarship: ఉన్నత విద్యలు చదవాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఎక్కువమంది చదువుకోవడానికి వెనుకడుగు వేస్తుంటారు.
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఉన్నత విద్య చదవాలనుకునే పేద విద్యార్థులకు ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ స్కాలర్ షిప్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకానికి అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనం అందించనుంది. అలాగే వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా సహాయపడేందుకు స్కాలర్ షిప్ ప్రోగ్రామ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి గరిష్టంగా 82,000 స్కాలర్ షిప్‌ను అందించనుంది.
ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ స్కాలర్ షిప్ అనే పథకానికి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు కొన్ని అర్హతలు పాటించాలి. సంబంధిత బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి ఇంటర్మీడియట్‌లో 80 శాతం పాస్ అయ్యి ఉండాలి. అయితే ఈ స్కాలర్ షిప్ అనేది ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అర్హులైన విద్యార్థులకు అందజేస్తారు. అదే డిగ్రీ విద్యార్థులు అయితే డిస్టేన్స్‌లో కాకుండా రెగ్యులర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఈ స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకునే వారికి ఎక్కువగా ఆదాయం ఉండకూడదు. స్థూల కుటుంబ ఆదాయం ఏడాదికి కేవలం రూ.4,50,000 మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే స్కాలర్‌షిప్ రాదు. అలాగే కేవలం పరీక్షల్లో పాస్ అయితే సరిపోదు. దీంతో పాటు హాజరు కూడా 75 శాతం ఉండాలి. అలాగే విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. అప్పుడే ఈ పథకానికి విద్యార్థులు అర్హులు అవుతారు. లేకపోతే ఈ స్కాలర్‌షిప్ అసలు అప్లై చేసుకోలేరు.
ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ స్కాలర్ షిప్‌కి డిస్టెన్స్ మోడ్ లేదా డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కీమ్‌కి అనర్హులు. అలాగే ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ ఉపకార వేతనాలు, ఫీజు మాఫీ, రీయింబర్స్‌మెంట్ వంటివి తీసుకుంటే మాత్రం వారికి ఈ స్కాలర్‌షిప్ రాదు. అలాగే ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయాలంటే బ్యాంకు వివరాలు, ఆధార్ నెంబరు, తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం, ఈ-మెయిల్ ఐడీ, కుల ధృవీకరణ పత్రం వంటివి అన్ని ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోగలరు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీ ఇంటర్మీడియట్ మార్కుల శాతం బట్టి ఈ స్కాలర్‌షిప్‌కు మిమ్మల్ని ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం స్టూడెంట్ స్కాలర్‌షిప్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
0 Response to "Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Scholarship"
Post a Comment