Sleeping With Socks
Sleeping With Socks: చలికాలం కాళ్లకు సాక్సులు వేసుకొని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Sleeping With Socks: గత కొద్ది రోజులుగా చలి చంపేస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ఉష్ణోగ్రతలు భారీగా డ్రాప్ అవుతూ వణుకు పుట్టిస్తున్నాయి. మామూలుగా ఇలాంటి చలి నుంచి ఉపశమనం కోసం స్వెటర్లు, మఫ్లర్లతో పాటు సాక్సులు కూడా వేసుకుంటారు.
కొందరైతే రాత్రి పడుకునేటప్పుడు కూడా సాక్సులు వేసుకుంటారు. వెచ్చగా, హాయిగా ఉంటుందని ఇలా చేస్తుంటారు. కానీ ఈ సీజన్‌లో కాళ్లకు సాక్సులు వేసుకొని పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉంటాయో చూద్దాం.
బెనిఫిట్స్ ఇవే.
వెచ్చదనం
చలిగాలులు చర్మాన్ని తాకితే వణుకు పుడుతుంది. ఇలాంటప్పుడు పాదాలు చల్లబడితే అంతే సంగతులు. శరీరం మొత్తం చలితో గడ్డకట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. అదే సాక్సులు వేసుకుంటే పాదాలు వెచ్చగా, హాయిగా ఉంటాయి. దీంతో శరీరం ఉష్ణోగ్రత కూడా కంట్రోల్‌లో ఉంటుంది. హాయిగా వెచ్చగా ఉంటే నిద్ర కూడా హాయిగా పడుతుంది, అందుకే రాత్రంతా వెచ్చగా ఉండాలంటే సాక్సులు ది బెస్ట్ ఆప్షన్.
రక్తప్రసరణ సాఫీగా
చలికి పాదాల్లో రక్తప్రసరణ మందగిస్తుంది. ముఖ్యంగా ఫీట్‌లో రక్తప్రసరణ సరిగా ఉండదు. దీనివల్ల అవి చల్లబడతాయి, తిమ్మిర్లు వస్తాయి. అదే సాక్సులు వేసుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగితే శరీరం మొత్తం వెచ్చగా ఉంటుంది. అంతేకాదు, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందేలా చేస్తుంది. సో, సాక్సులు వేసుకోవడం వల్ల కేవలం వెచ్చదనమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్న
నిద్రలేమికి పరిష్కారం
నిద్రకు, పాదాలకు మధ్య చాలా సంబంధం ఉంది. పాదాలు చల్లగా ఉంటే నిద్ర పట్టదు, చిరాకుగా అనిపిస్తుంది. సాక్సులు వేసుకుంటే ఫీట్ వెచ్చబడి హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాదు, తొందరగా నిద్ర రావడమే కాకుండా, మధ్యలో మెలుకువలు రాకుండా చక్కగా నిద్రపోవచ్చు. ఒకవేళ మీరు కూడా కోల్డ్ ఫీట్ కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే, సాక్సులు వేసుకోవడం ఒక మంచి పరిష్కారం.
ప్రమాదాలు ఇన్ఫెక్షన్ల భయం
తడి సాక్సులు వేసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సాక్సులు తడిగా ఉంటే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల "అథ్లెట్స్ ఫుట్" లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి, చెమటతో తడిసిన సాక్సులు వేసుకోకూడదు.
గాలి ఆడదు
రాత్రంతా సాక్సులు వేసుకుంటే పాదాలకు గాలి తగలదు. దీనివల్ల చెమట ఎక్కువగా పడుతుంది. చెమట, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు పాదాల నుంచి భరించలేని దుర్వాసన కూడా వస్తుంది.
చెమటతో చిరాకు
సాక్సులు మరీ టైట్‌గా ఉంటేనో, లేదా మరీ వెచ్చగా ఉంటేనో పాదాలకు చెమటలు పట్టేస్తాయి. చెమటతో అవి జిడ్డుగా మారి చిరాకు తెప్పిస్తాయి. అంతేకాదు, దురద, ఇరిటేషన్ కూడా వస్తాయి. సాక్సుల్లో చెమట పేరుకుపోతే బొబ్బలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలూ వచ్చే ప్రమాదం ఉంది.
టిప్స్
పడుకునేటప్పుడు సాక్సులు వేసుకోవడం కొందరికి అలవాటు. చలికాలంలో వెచ్చగా ఉండటానికి ఇది మంచి ఐడియానే. కానీ, సమస్యలు తలెత్తకుండా కొన్ని టిప్స్ పాటించాలి. కాటన్, ఉన్ని (Wool) లాంటి సాఫ్ట్ మెటీరియల్స్‌తో చేసిన సాక్సులు ఎంచుకోవాలి. ఇవి పాదాలను పొడిగా ఉంచుతాయి. సాక్సులు మరీ బిగుతుగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్‌గానూ ఉండకూడదు. కరెక్ట్‌గా ఫిట్ అయ్యే సాక్సులు మాత్రమే వేసుకోవాలి. పడుకునే ముందు ఎప్పుడూ ఫ్రెష్, క్లీన్ సాక్సులు వేసుకోవాలి.
0 Response to "Sleeping With Socks"
Post a Comment