Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Types of Bank Cheques

 Bank Cheques: బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలో వివరణ.

Types of Bank Cheques

దేశంలో యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులు ఉన్నా ఆర్థిక లావాదేవీల కోసం చెక్కులు అనేవి కీలకమైన సాధనంగా మారాయి. ముఖ్యంగా భారీ స్థాయిల్లో లావాదేవీల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు.

ముఖ్యంగా చెక్కుల చెల్లింపులు ట్రాన్స్‌యాక్షన్‌ రుజువు కోసం ఎక్కువగా వాడతారు. బ్యాంకులు సాధారణంగా పొదుపు, కరెంట్ ఖాతాదారులకు చెక్‌ బుక్‌లను జారీ చేస్తాయి. అయితే ఏయే చెక్కులు ఎలాంటి సమయంలో వాడాలో? చాలా మంది తెలియదు. కాబట్టి భారతదేశంలో ఉన్న తొమ్మిది రకాల బ్యాంక్ చెక్‌ వాటి ఉపయోగాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

బేరర్ చెక్

బేరర్ చెక్‌ కలిగి ఉన్న వ్యక్తి దానిని క్యాష్ చేసుకోవచ్చు. లావాదేవీ కోసం అదనపు గుర్తింపు అవసరం లేదు. తక్షణ నగదు ఉపసంహరణలకు ఇది అనువైనది. ఈ చెక్కు త్వరితగత లావాదేవీలకు అనుకూలమైన చెక్కు. అయితే ఈ చెక్కును పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఆర్డర్ చెక్

ఆర్డర్ చెక్ చెల్లింపుదారు పేరు తర్వాత రాసిన ఆర్డర్ అని రాస్తే దానిని ఆర్డర్‌ చెక్కుగా బ్యాంకు అధికారులు పరిగణిస్తారు. ఈ చెక్కు ద్వారా చేసే లావాదేవీ పేర్కొన్న వ్యక్తికి లేదా వారి అధీకృత ప్రతినిధికి మాత్రమే చేస్తారు. మన బ్యాంకు లావాదేవీలకు మరింత భద్రతను అందిస్తుంది. ప్రత్యేకించి నిర్దిష్ట వ్యక్తి లేదా సంస్థకు చెక్కులను అందజేసేటప్పుడు ఈ చెక్కు బాగా ఉపయోగపడుతుంది.

క్రాస్డ్ చెక్

క్రాస్డ్ చెక్‌ ఎడమ మూలలో రెండు సమాంతర రేఖలు ఉంటాయి. తరచుగా “అకౌంట్‌ చెల్లింపుదారు” అనే పదాలు ఉంటాయి. చెక్కులో పేర్కొన్న చెల్లింపుదారుడి ఖాతాకు నిధులు నేరుగా జమ చేస్తారు. ఈ చెక్కు అనధికార వ్యక్తులకు చెల్లింపు జరగకుండా చూసుకోవచ్చు. అలాగే సురక్షిత లావాదేవీలకు అనువైనదిగా ఈ చెక్కు చెల్లింపును పేర్కొంటున్నారు. .

ఓపెన్‌ చెక్‌

ఓపెన్‌ చెక్కును అన్ క్రాస్డ్ చెక్ అని కూడా పిలుస్తారు. ఈ చెక్కు జారీ చేసేవారి బ్యాంక్‌ ఎన్‌క్యాష్‌ చేసుకోవచ్చు. ఈ చెక్కు బేరర్ చెక్కును పోలి ఉంటుంది.ఈ చెక్కు బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేయకుండా నగదు ఉపసంహరణకు లేదా చెల్లింపులు చేయడానికి ఉపయోగపడుతుంది.

పోస్ట్ డేటెడ్ చెక్

పోస్ట్-డేటెడ్ చెక్‌లో రాబోయే తేదీతో జారీ చేస్తారు. చెల్లింపు నిర్దిష్ట తేదీలో లేదా తర్వాత మాత్రమే ప్రాసెస్ చేస్తారు. ఈ చెక్కులను సాధారణంగా వాయిదాల చెల్లింపులకు, ఈఎంఐలు వంటి వాటిల్లో వినియోగిస్తారు. 

స్టేల్‌ చెక్‌

చెల్లుబాటు వ్యవధిని మించిన చెక్కు సాధారణంగా జారీ చేసిన తేదీ నుంచి మూడు నెలలు చెక్‌ను స్టేల్‌ చెక్‌ అంటారు. ఈ చెక్కు ఎలాంటి నగదు చెల్లింపుకు చెల్లదు.

ట్రావెలర్స్ చెక్

అంతర్జాతీయ ప్రయాణ సమయంలో చెల్లింపుల కోసం ట్రావెలర్స్ చెక్కులు ఉపయోగిస్తారు.ఈ చెక్కులు బహుళ డినామినేషన్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ చెక్కులు ఎలాంటి గడువు తేదీని కలిగి ఉండవు. పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లకుండా, విదేశాలలో సురక్షితమైన లావాదేవీలు చేసే వారికి ఈ చెక్కులు అనువుగా ఉంటాయి. 

సెల్ఫ్‌ చెక్‌

ఖాతాదారుడు తమ బ్యాంకు ఖాతా నుంచి నగదును విత్‌డ్రా చేసుకునేందుకు సెల్ఫ్ చెక్ జారీ చేస్తారు. చెక్ పేరు ఫీల్డ్లో ” సెల్ఫ్” అనే పదం రాయాల్సి ఉంటుంది.డెబిట్ కార్డ్ ఉపయోగించకుండా నగదు ఉపసంహరించుకోవడానికి ఉపయోగపడుతుంది. 

బ్యాంకర్ చెక్

ఖాతాదారుని తరపున బ్యాంక్ జారీ చేసిన, అదే నగరంలో పేర్కొన్న వ్యక్తి లేదా సంస్థకు బ్యాంకర్ చెక్కు చెల్లిస్తారు. ప్రభుత్వ రుసుములు లేదా పెద్ద లావాదేవీలు వంటి హామీతో కూడా నిధులు అవసరమయ్యే చెల్లింపులకు ఈ చెక్కు పని చేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Types of Bank Cheques"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0