You can easily spot frauds at petrol pumps by following these 5 tips.
పెట్రోల్ పంపుల్లో జరిగే మోసాలను ఇలా సులభంగా గుర్తించండి.. ఈ 5 సూచనలు పాటించగలరు.
రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏమాత్రం వాటిని కొనలేని పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా జేబులకు చిల్లు పడుతోంది.
అయితే హైదరాబాద్ నగరంలో తాజాగా పలువురు పెట్రోల్ పంప్‌ల యజమానులు చేస్తున్న మోసాలు బట్టబయలయ్యాయి. ఓ ముఠాతో చేతులు కలిపిన వారు వినియోదారులకు తక్కువ పెట్రోల్ కొడుతూ సొమ్ము గడిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు అలాంటి పంప్‌లపై దాడులు చేసి వాటిని సీజ్ చేశారు. ఆ ముఠా సభ్యులను, పంప్ యజమానులను అరెస్టు చేశారు.
అయితే పెట్రోల్ పంప్‌లలో జరిగే మోసాలను పసిగట్టేందుకు కింద తెలిపిన సూచనలను పాటించాలి. అవేమిటంటే.
- 1. కొందరు పెట్రోల్ పంపుల యజమానుల పెట్రోల్ ఫిల్లింగ్ మెషిన్‌లలో ప్రత్యేక చిప్‌లను అమరుస్తారు.
 - దీంతో పెట్రోల్ కొట్టినప్పుడల్లా వినియోగదారులు తీసుకునే పెట్రోల్ పరిమాణాన్ని బట్టి 30 ఎంఎల్ నుంచి 50 ఎంఎల్, 100 ఎంఎల్ వరకు తక్కువ వస్తుంది.
 - దీంతో ఆ మేర వినియోగదారులకు తక్కువ పెట్రోల్ వస్తుంది.
 - ఈ మోసాన్ని పసిగట్టలేరు.
 - కానీ మీరు రెగ్యులర్‌గా ఒకే పంపులో పెట్రోల్ కొట్టిస్తుంటే పరీక్షించవచ్చు.
 - వాహన ట్యాంకును ఖాళీ చేసి అందులో పెట్రోల్ నింపించాలి.
 - తరువాత పెట్రోల్ బయటకు తీసి బాటిల్‌లో నింపాలి.
 - దీంతో మీరు కొట్టించిన మొత్తానికి ఎంత పెట్రోల్ వస్తుంది తెలుస్తుంది.
 - మోసం జరిగితే సులభంగా గుర్తించవచ్చు. ఈ పరీక్షను మీరు ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది. లేదంటే మోసపోతారు.
 - 2. పెట్రోల్ నింపేవారు నాజిల్‌ను చేత్తో అలాగే పట్టుకుంటారు.
 - దీంతో పెట్రోల్ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల పెట్రోల్ కొట్టేటప్పుడు నాజిల్‌ను ట్యాంకులో పెట్టి చేయి తీసేయమనాలి.
 - దీని వల్ల పెట్రోల్ మోసం జరగకుండా నివారించవచ్చు.
 - 3. కొన్ని పంపుల్లో వాహనదారులను ఏమార్చి జీరో రీడింగ్ చూపించకుండా పెట్రోల్ నింపుతారు.
 - కనుక పెట్రోల్ నింపేటప్పుడు కచ్చితంగా రీడింగ్ జీరో ఉందా, లేదా.. అనేది గమనించాలి.
 - 4. కొన్ని పంపుల్లో పెట్రోల్ నింపే క్రమంలో జీరో నుంచి రీడింగ్ ఒక్కసారిగా రూ.10, రూ.20కి జంప్ అవుతుంది. అంటే ఆ మొత్తం డబ్బుకు సమానమైన పెట్రోల్‌ను కొట్టకుండానే రీడింగ్ అక్కడి వరకు వెళ్లిందని అర్థం.
 - అంటే రూ.10 లేదా రూ.20 మేర మీకు పెట్రోల్ తక్కువ వస్తుందని తెలుసుకోవాలి.
 - రీడింగ్ జీరో నుంచి 1, 2, 3.. ఇలా వస్తుందేమో చూడాలి. లేదంటే వాహనంలో పెట్రోల్ ను తక్కువ నింపుతున్నట్లే అర్థం చేసుకోవాలి. ఇలా జరిగితే వెంటనే ప్రశ్నించాలి. మోసం జరగకుండా నివారించాలి.
 - 5. ఇక కొన్ని సందర్భాల్లో పెట్రోల్ కొడుతూ మధ్యలో ఆపుతారు.
 - అంటే.. ఉదాహరణకు మీరు రూ.1000 పెట్రోల్ కొట్టమని అడిగారనుకుందాం. రూ.200 కు రాగానే మీటర్ ఆపుతారు.
 - ఏదో సమస్య వచ్చిందని బుకాయిస్తూ అక్కడ ఆపి అక్కడ రీడింగ్‌ను రూ.800 చేసి కొడతారు. అంటే.. రూ.200, రూ.800 కలిపి రూ.1000 అవుతుందని మీరు అనుకుంటారు.
 - కానీ నిజానికి మీకు లభించేది రూ.800 విలువైన పెట్రోల్ మాత్రమే. ఎలాగంటే.. రూ.200 కొట్టిన తరువాత ఆపితే రూ.800 కు రీడింగ్ సెట్ చేస్తే అప్పటికే ఉన్న రూ.200 రీడింగ్‌ను జీరో చేయాలి.
 - కానీ అలా చేయరు.
 - అక్కడి నుంచే మీకు పెట్రోల్ కొడతారు. అంటే మీకు రూ.200 తక్కువ వస్తుందన్నమాట. దీంతో రూ.800 పెట్రోల్ మాత్రమే మీకు వస్తుంది.
 - ఇలా గనక పంపులోని సిబ్బంది చేస్తుంటే వెంటనే జాగ్రత్త పడాలి.
 - రీడింగ్‌ను జీరో చేసి నింపమని అడగాలి. దీంతో మోసం జరగకుండా చూసుకోవచ్చు.
 



0 Response to "You can easily spot frauds at petrol pumps by following these 5 tips."
Post a Comment