AP government is preparing for key reforms in inter education.
AP News: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తాం: ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా
అమరావతి: ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘‘చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తాం. 2024-25 నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుంది. (AP Inter)
15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నాం. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తాం. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తాం. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది. ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలి. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచాం’’ అని కృతికా శుక్లా తెలిపారు
0 Response to "AP government is preparing for key reforms in inter education."
Post a Comment