Big Alert .. Chance of your UPI Payments from tomorrow.
బిగ్ అలెర్ట్.. రేపటి నుంచి మీ UPI పేమెంట్స్ బంద్ అయ్యే ఛాన్స్.. అర్జెంటుగా ఇలా చేయగలరు.
భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు నిత్యం జరిగే వ్యవహారంగా మారిపోయాయి. ఇదంతా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చలువే అని చెప్పాలి.
క్షణాల్లో డబ్బులు పంపే ఈ టెక్నాలజీ, డబ్బు లావాదేవీల తలనొప్పిని చాలా వరకు తగ్గించేసింది. అయితే 2025, ఫిబ్రవరి 1 నుంచి మీ UPI పేమెంట్స్‌కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్ ఒకటి తీసుకొస్తోంది, దానివల్లే ఈ సమస్య రాబోతోంది.
అసలు ఆ రూల్ ఏంటి? యూపీఐ పేమెంట్స్ ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కొత్త రూల్ ఏంటంటే ఇప్పటివరకు మీ UPI ఐడీలలో స్పెషల్ క్యారెక్టర్లు (@, !, #, - లాంటివి) వాడుతూ ఉంటే, ఇకపై కుదరదు. NPCI ప్రకారం, 2025, ఫిబ్రవరి 1 నుంచి UPI ఐడీలు కేవలం అక్షరాలు, సంఖ్యలు (ఆల్ఫాన్యూమరిక్) మాత్రమే ఉండాలి.
ఎలాంటి UPI ఐడీలు చెల్లుతాయి, చెల్లవు?
చెల్లుబాటు అయ్యే UPI ఐడీ: 1234567890oksbi (ఇందులో అక్షరాలు, సంఖ్యలు మాత్రమే ఉన్నాయి). చెల్లని UPI ఐడీ: 1234567890@ok-sbi (ఇందులో "@" అలాగే "-" స్పెషల్ క్యారెక్టర్లు ఉన్నాయి). చాలా బ్యాంకులు, యాప్స్ ఇప్పటికే ఈ రూల్‌ను పాటిస్తున్నా, కొందరు మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే UPI ఐడీలు క్రియేట్ చేస్తున్నారు.
అందుకే NPCI అందరూ ఒకే రూల్ పాటించాలని ఈ నిర్ణయం తీసుకుంది. స్పెషల్ క్యారెక్టర్లు వాడితే మీ పేమెంట్ జరగదు. మీరు స్పెషల్ క్యారెక్టర్లతో ఉన్న UPI ఐడీతో డబ్బులు పంపడానికి ట్రై చేస్తే, మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఈ కొత్త రూల్ గురించి తెలియకపోతే, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
పేమెంట్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి
UPI యాప్ అప్‌డేట్ చేయాలి. రీసెంట్‌గా అప్‌డేట్ చేసిన వారూ UPI యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. కొత్త రూల్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ యాప్ అప్‌డేట్ చేస్తేనే వస్తాయి. ఇప్పుడు UPI యాప్ ఓపెన్ చేసి, మీ UPI ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్నాయో లేదో చూడండి. ఉంటే వెంటనే కస్టమర్ సపోర్ట్‌ను కాంటాక్ట్ అవ్వాలి.
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే UPI యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. థర్డ్-పార్టీ యాప్స్ NPCI రూల్స్ పాటించకపోవచ్చు. చాలా UPI యాప్స్ ముఖ్యమైన మార్పుల గురించి నోటిఫికేషన్స్ పంపిస్తాయి. మీ యాప్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ ఆన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
NPCI ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చింది.
UPI అనేది ఇండియాలో అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సిస్టమ్. 2024, డిసెంబర్‌లో ఒక్క నెలలోనే 16.73 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. UPIని మరింత సెక్యూర్, అందరికీ ఒకేలా ఉండాలని NPCI ఈ రూల్ తీసుకొచ్చింది. స్పెషల్ క్యారెక్టర్లు తీసేస్తే, తప్పులు, మోసాలు తగ్గుతాయని NPCI భావిస్తోంది. ఈ మార్పుతో ప్రజలు ఎఫెక్టయ్యే అవకాశమున్నా అది వారందరి మంచి కోసమే.
0 Response to "Big Alert .. Chance of your UPI Payments from tomorrow."
Post a Comment