Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

For Maha Kumbha Mela goers

 మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం 

For Maha Kumbha Mela goers

1.తెలుగు వాళ్లు అందరు మహాకుంభ  మేళా సందర్శనకి వెళ్లి వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్లండి ,బస్సు ద్వారా వెళ్తే  16 Km దూరం లో పోలీస్ లు ఆపేస్తారు, అక్కడ నుండి నడుచుకుంటూ మేళా కి వెళ్ళాలి.

2.కుంభం మేళా లకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళా ని సెక్టార్ లు గా, కాటున్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి, లేక పోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్ధం కాదు.

3.మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి 

4.16-17కాటున్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జి ల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు )

4.ప్రయాగ రాజ్ ని మూడు గా విభజించారు A.జ్యూస్సి ,B. హరిలాగంజ్ C.సంగం 

5.నది కి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టర్ (12 నుండి 21 వరకు ఉంటాయి.

6.హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపు నా ఉంటుంది దీనిలో సెక్టార్ (5,11,10,9,8,7,6,18,19)ఉంటాయి.

7.ముఖ్యం మైంది, సంగం దీనిలో ఇది మెయిల్ రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో సెక్టార్ 3,4,ఉంటాయి.

8.మిగతావి 22,23, చాలా దూరం లో ఉంటాయి.🚩🚩🚩   వసతి సదుపాయాలు 🚩🚩9.సెక్టర్ 6 లో TTD వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి. కానీ అక్కడ stay చేయనివ్వరు, స్వామి వారికీ బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకొనివ్వరు.

10.మీరు అక్కడ హిందీ వాళ్లవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు వున్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు. (.ముఖ్యం గా సెక్టార్ 18లో స్టే చేయవాచ్చు నదికి 100 మీటర్లు లో ఉంటాయి.)

11.సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువు లు, అఘోరాలు, వుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండ మంటారు చక్కగా ఉండొచ్చు.

12.సెక్టార్ 1లో ప్రవైట్ సదుపాయాలు ఉంటాయి రోజు కి 200 రూపాయలు 

13.అన్ని సెక్టార్ లో పెయిడ్ వసతులు కలవు రోజుకి 1000 -2000 తీసుకుంటారు( 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు )..🚩🚩భోజనం సదుపాయాలు 🚩🚩

14.మీకు అన్ని సెక్టార్ లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి (ఉత్తర భారతదేశం వంటకలు అన్ని అక్కడ ఫ్రీ గా తిన్నవచ్చు…

🚩🚩హెల్ప్ లైన్ 🚩🚩

16.మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీస్ లు మీమల్ని గైడ్ చేస్తారు.

17.మేళా లో అయితే పోలీస్ లు అడుగడుగునా మన కు ఎటువైపు వేళలో చాలా బాగా చెప్తారు.

🚩🚩🚩స్నానం ఎలా🚩🚩. 18ఎవరైతే పుణ్యం స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్ లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా.

19.2-3days వుండే వాళ్లు మాత్రమే ఎదో ఒక సెక్టార్ నదికి దగ్గరో వుంటుంది అక్కడే ఉండడం మంచిది, లేకపోతే నదికి, సెక్టార్ కి దూరమైత్ తప్పిపోయే అవకాశం కలదు 

🚩🚩నాగసాధువులు, అఘోరాలు, అఖడా లను చూడాలి, వాళ్ళు ఆశీర్వదాలు తీసుకో వలనంటే సెక్టార్ 19,18,20 లో వుంటారు.

🚩🚩చివరిగా నా మాట ప్రతి ఒకరు తప్పక చెయ్య వలిసిన పవిత్ర అమృత స్నానం 

🚩🚩ఫ్యామిలీ తో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకుని వెళండి, లేకపోతే చాలా ఇబ్బంది పాడుతారు.

🚩🚩ఒంటరి గా కంటే నలుగురు గా వెళ్తే చాలా మంచిది.

🚩🚩🚩ఎన్నికోట్లమంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగం రాజ్.



144 సంవత్సరాలకొకసారి వచ్చే "మహాకుంభ మేళా" లో పాల్గొనే అదృష్టం మాకు ఒక పూర్వజన్మ సుకృతంల భావిస్తున్నాము .. ప్రపంచంచంలోనే అత్యధికంగా జనం గుమిగూడె సంఘటనగా దీని గురించి చెబుతున్నారు. దాదాపు 43 కోట్ల జనాభా కుంభ మేళాలో పాల్గొంటారట.ఈ భూతలంపై ప్రధమ యజ్ఞభూమిగా చెప్పబడే ఈ ప్రయాగరాజ్ లో మహా కుంభ మేళా జరుగుతోంది.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దానికి తగ్గట్లుగానే వేల కోట్ల నిధులతో ఏర్పాట్లు చేసింది.. నభూతో నా భవిష్యత్.

సర్వేజనాః సుఖినోభవంతు..

🕉️🙏🏻🕉️

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "For Maha Kumbha Mela goers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0