HOW TO FIND BEST CINNAMON
మీరు తినే దాల్చిన చెక్క చైనా నుంచి వచ్చిందా? - ఇలా కనిపెట్టండి! - HOW TO FIND BEST CINNAMON
శ్రీలంక నుంచి వచ్చేదే మంచిదంటున్న నిపుణులు - గుర్తించడానికి పలు సూచనలు.
How to Find best cinnamon : మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క స్పెషాలిటీ వేరే. బిర్యానీ, నాన్ వెజ్ వంటకాల్లో ఇది లేకుంటే పని జరగదు. టేస్ట్, సువాసన పరంగానే కాకుండా హెల్త్‌కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఇంత ఫేమసైన ఈ దాల్చిన చెక్కలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి Cinnamomum verum దాల్చిన చెక్క. రెండోది cassia(కాషా ) రకం. ఇందులో మొదటి దాన్నే మేలైనది గుర్తించారు. అయితే, ఇది తక్కువగా దొరుకుతుంది. అందువల్ల ఖరీదు ఎక్కువ.
ఇలా పండిస్తారు :
Cinnamomum verum అనేది ఒక చెట్టు పేరు. దీని బెరడే దాల్చిన చెక్క. ఇది శ్రీలంకలో పండుతుంది. దీన్ని చుట్టగా చుడతారు. ఇతర రకాల దాల్చిన చెక్కలు కూడా ఇలాగే పండించినప్పటికీ, క్వాలిటీలో తేడా ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా వాడేది cassia దాల్చిన చెక్కనే. దీన్ని చైనాలో ఎక్కువగా పండిస్తారు. శ్రీలంక రకాన్ని మనదగ్గర కేరళలో పండిస్తారు. దీన్ని Malabar Cinnamon అంటారు. కానీ, చాలా తక్కువ మొత్తంలో ఇక్కడ పండుతోంది. ఈ మధ్యనే కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీలంక రకం దాల్చిన చెక్కను పండించడం స్టార్ట్ చేశారు.
అదే ఎందుకు మంచిది?
రుచి పరంగా చూసుకున్నా, క్వాలిటీ పరంగా చూసుకున్నా శ్రీలంక రకం మంచిదని ఆరోగ్య నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయట. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరచడానికి ఇది సహాయపడుతుందట. అంతేకాదు, గుండె జబ్బుల నివారణకూ మంచిదని పలు రీసెర్చెస్ చెబుతున్నాయి. ఒక మనిషి రోజూ 120 మిల్లీగ్రాముల దాల్చిన చెక్క తీసుకోవచ్చట. డయాబెటీస్ బాధితులు దాల్చిన చెక్క పొడిని హాట్ వాటర్‌లో వేసుకునే తాగితే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయట.
శ్రీలంక, చైనా దాల్చిన చెక్క మధ్య తేడా (ETV Bharat)
శ్రీలంక రకం ఎలా గుర్తించాలి :
ధర ఎక్కువగా ఉంటుంది.
రోల్స్‌గా చుట్టి ఉంటాయి.
గట్టిగా ఉండదు. సునాయాసంగా విరగగొట్టొచ్చు.
ఘాటుగా ఎక్కువగా ఉండదు.
చైనా రకం ఎలా గుర్తించాలి :
ఈ చెక్క గట్టిగా ఉంటుంది.
ఘాటు ఎక్కువగా ఉంటుంది.
రేటు తక్కువగా ఉంటుంది.
దీనిపై cassia అని ఇంగ్లీషులో రాసి ఉంటుంది.
ముదురు గోధుమరంగులో ఉంటుంది
చైనా రకం చెక్కలో Coumarin అనే పదార్థం చాలా ఉంటుంది. దీనివల్ల కొన్ని రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. శ్రీలంక రకంలో ఈ రసాయనం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండిటితోపాటు వియత్నాంలో కూడా పండిస్తారు. దీన్ని "సైగన్" అంటారు. దీనికి ఘాటు ఎక్కువ. ఇండోనేషియాలో లభించేదాన్ని "కొరిన్ట్‌జె"అంటారు. కాస్త స్వీట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని బేకరీల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు.
0 Response to "HOW TO FIND BEST CINNAMON"
Post a Comment