Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Huge constable jobs.. Just pass the tent. Full details 

 Jobs In CISF: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు. పూర్తి వివరాలు 

Huge constable jobs.. Just pass the tent. Full details

టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1124

ఇందులో కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కానిస్టేబుల్/డ్రైవర్: 845 ఉద్యోగాలు(ఇందులో యూఆర్-344, ఈడబ్ల్యూఎస్-84, ఎస్సీ-126, ఎస్టీ-63, ఓబీసీ-228 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి)

కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ ఆపరేటర్ : 279 ఉద్యోగాలు(యూఆర్-116, ఈడబ్ల్యూఎస్-27, ఎస్సీ-41, ఎస్టీ-20, ఓబీసీ-75 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి)

విద్యార్హత: టెన్త్ పాస్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: 2025 మార్చి 4 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ఎత్తు 167 సెం.మీ, ఛాతీ 80 నుంచి 85 సెం.మీ ఉండాలి.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు మినహాయింపు ఉంటుంది.)

టెన్త్ క్లాస్ పాసై ఉండి శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ప్రిపరేషన్ షురూ చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖమైన తేదీలు 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 03.02.2025

దరఖాస్తుకు చివరి తేది: 04.03.2025

అఫీషియల్ వెబ్ సైట్:

https://cisfrectt.cisf.gov.in/

N O T I F I C A T I O N 



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Huge constable jobs.. Just pass the tent. Full details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0