Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Now you have to pay 60% tax: RBI's new rule in detail.

 ఇకపై మీరు 60% టాక్స్ కట్టాలి: RBI కొత్త రూల్ వివరంగా.

మీరు సేవింగ్స్ అకౌంట్ లో కుదిరినప్పుడల్లా డబ్బులు వేసేస్తున్నారా? అయితే మీరు భారీగా టాక్స్ కట్టాల్సి ఉంటుంది. RBI కొత్త మార్గదర్శకాలు అలాగే ఉన్నాయి.

వాటి ప్రకారం లిమిట్ దాటితే ఏకంగా 60 శాతం టాక్స్ కట్టాలి. RBI క్యాష్ డిపాజిట్ లిమిటేషన్స్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో.

కొత్త సంవత్సరంలో RBI చాలా రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకు తెరవడం, మూయడం టైమింగ్స్ నుంచి EPRO నియమాల వరకు చాలా మార్పులు వచ్చాయి. మూడు రకాల అకౌంట్లను మూసేయాలని కూడా బ్యాంకు నిర్ణయించింది. ఇవే కాకుండా ఆదాయపు పన్ను కూడా మారింది. అందులో భాగంగానే ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. కారణం తెలుసుకుందాం రండి.

 మరీ గాని మీ సేవింగ్స్ అకౌంట్ లో రూ.10 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే సుమారు 60% వరకు టాక్స్ కట్టాల్సి రావచ్చు. అయితే మీరు ఆర్బీఐ సూచించిన రూల్స్ పాటిస్తే అంత టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.

మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకులో రూ.10 లక్షలకు పైగా అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు కచ్చితంగా పాన్ కార్డ్ డీటైల్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ డబ్బులు ఎక్కడి నుంచి మీకు వచ్చాయి. వాటికి చట్టబద్ధత ఉందా? ఇలాంటి వివరాలన్నీ చెప్పాలి. వాటిల్లో ఏది తేడాగా ఉన్నా, వాటిల్లో ఏ రూల్ మీరు పాటించకపోయినా బ్యాంకు మీకు 60 % వరకు టాక్స్ వేస్తుంది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా విడుదల చేసిన రూల్ ఇదే. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే డబ్బు వివరాలు ఇవ్వాలి. డబ్బు ఎలా వచ్చిందో చెప్పకపోతే 60% టాక్స్ పడుతుంది. నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

ఇది ఒక రోజులోనో, నెలలోనో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే విధించే టాక్స్ కాదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ అయితేనే మీరు డీటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీ పాన్ కార్డ్, ఇతర ఆదాయ మార్గాలను చూపించాల్సి ఉంటుంది.

RBI నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ ఇవ్వాలి. ఇంతకు ముందు ఈ పరిమితి రూ.50,000లకే ఉండేది. తర్వాత రూ.2.5 లక్షలకు మార్చారు. ఇప్పుడు రూ.10 లక్షలు చేశారు. ఆదాయ, వ్యయాలు పెరుగుతుండటంతో డిపాజిట్ లిమిట్ కూడా పెంచారు. ఇది ఒక రకంగా మంచి విషయమే. లేకుండే రూ.50,000 లకే ఇన్ కమ్ సోర్స్ వివరాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది.

మీకు ఈ రూల్ ఇబ్బందిగా ఉంటే.. దీన్ని తప్పించుకోవడానికి మరో సులభమైన మార్గం ఉంది. అదే ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ రెగ్యులర్ గా కట్టడం. మీ ఆదాయం చట్టబద్ధమైతే ఎలాంటి సమస్య ఉండదు. ఏదైనా విచారణ సమయంలో సమాచారం ఇవ్వగలిగేలా అన్ని ఆదాయం, లావాదేవీల రికార్డులు ఉంచుకోండి.

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయండి. రూ.10 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించండి. ఈ నియమాల గురించి మరింత వివరంగా డీటైల్స్ కావాలంటే మీ బ్యాంక్ అధికారిని సంప్రదించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Now you have to pay 60% tax: RBI's new rule in detail."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0