Our ancestors' chicken curry is the same, so they do not get sick
మన పూర్వీకుల చికెన్ కూర ఇలానే చేసుకునేవారట,అందుకే వారికి రోగాలు రావు
ఇప్పుడైతే చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకుంటున్నారు. కానీ గతంలో కేవలం చికెన్ కూర మాత్రమే చేసుకునే వారు. మన అమ్మమ్మలు, నానమ్మలకు తెలిసింది అదొక్కటే.
అది కూడా చాలా రుచికరమైన పద్దతిలో, ఆరోగ్యవంతంగా ఎలాంటి ఫ్యాన్సీ మెటీరియల్స్ వినియోగించకుండా ఆ కూరను ప్రిపేర్ చేసుకునే వారు. అయితే అదే పద్దతిలో మళ్ళీ చికెన్ కూర చేసుకోవాలనుకుంటే ఈ స్టోరీని పూర్తిగా చదవండి. ఈ స్టోరీలో పాతకాలంలో చికెన్ కూడా ఎలా వండుకునేవారో వివరించాము చదవండి.
పూర్వీకుల మాదిరిగా చికెన్ కూర వండడానికి కావాల్సిన పదార్థాలు
చికెన్
నూనె
ధనియాల పొడి
దంచి పెట్టుకున్న గరం మసాలా
నూరిన కారం
పసుపు
దాల్చిన చెక్క
ఆవాలు
లవంగాలు
రుచికి సరిపడా ఉప్పు
పూర్వీకుల మాదిరిగా చికెన్ కూడా వండుకునే విధానం
మన పూర్వీకుల మాదిరిగా చికెన్ కర్రీ తయారు చేసుకోవడం చాలా సులభం. అందుకోసం ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ చికెన్‌ను ఓ గిన్నెలో తీసుకొని అందులో నూరిన కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి.
ఆ తరువాత ఆ చికెన్‌ను ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. ఆ మట్టి పాత్రలో నూనె పోసుకోవాలి. నూనె వేగాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఆవాలు, వేసుకోవాలి. అవి కాస్త వేగాక.. అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి.
చికెన్ నుంచి నీరు ఊరాక, అందులో చికెన్ వండడానికి సరిపడా నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ బాగా ఉడికాక అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరో అయిదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత దానిపై కొత్తిమీర చల్లుకుంటే పూర్వీకుల స్టైల్‌లో చికెన్ కూర సిద్ధమైనట్లే.
0 Response to "Our ancestors' chicken curry is the same, so they do not get sick"
Post a Comment