Post Office Schemes
Post Office Schemes: ఇంట్లో మగ పిల్లలు ఉన్నవారు పోస్ట్ ఆఫీస్ లో ఈ అద్భుతమైన స్కీం గురించి తెలుసుకోండి..ఒకేసారి రూ. 16 లక్షలు పొందగలరు.
Post Office Schemes: ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ లో ప్రజల కోసం పలు రకాల స్కీమ్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతం ఉన్న ఈ ప్రత్యేకమైన స్కీం గురించి చాలామందికి తెలియదు అనే చెప్పాలి.
పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతం చాలా రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కీమ్స్ నుంచి చాలా ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అలాగే దేశవ్యాప్తంగా చాలా గ్రామస్థాయిలో కూడా పోస్ట్ ఆఫీస్ లో, పోస్టల్ అధికారులకు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దీంతో పోస్టల్ నెట్ వర్క్ చాలా బలమైనది అని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ అధికారులు ప్రస్తుతం ప్రజలకు తమ సేవలను మరింత సులభం మరియు చేరువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలోని పోస్టల్ అధికారులు ప్రజలకు పిపిఎఫ్ అకౌంట్ సేవలు అందించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలు, మండల స్థాయికి చెందిన ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రజలకు పిపిఎఫ్ అకౌంట్ గురించి తెలియజేస్తున్నారు పోస్టల్ అధికారులు. ఎక్కువమంది ఈ పథకంలో చేరేందుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. అయితే పి పి ఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సేవింగ్స్ స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేటును పొందవచ్చు. ఈ పథకంపై 7.1 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ చేరాలనుకునే వాళ్ళు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్లో 15వేల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తాము పెట్టిన డబ్బులను అలాగే వడ్డీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం, అలాగే వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు అని చెప్తున్నారు. ఈ విధంగా పూర్తిగా ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది చాలా మంచి స్కీమ్ అని అర్థమవుతుంది. మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి మీరు ఈ పథకంలో చేరొచ్చు. 500 రూపాయలతో పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరవచ్చు. ప్రతి నెల ఆ ఖాతాలో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీము టెన్యూర్ కూడా పొడిగించుకోవచ్చు.
మీకు ఐదేళ్లకొకసారి టెన్యూర్ పెంచుకునే అవకాశం ఉంది. మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారా దాని ఆధారంగా మీకు మెచ్యూరిటీ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లల పేరు పై కూడా పోస్ట్ ఆఫీస్ లో మీరు ఈ స్కీం లో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ లోని ఈ స్కీం లో ప్రతి నెల రు.5 వేలు పెడితే, మెచ్యూరిటీ లో మీకు రూ.16 లక్షలు పైగా పొందవచ్చని తెలుస్తుంది.
0 Response to "Post Office Schemes"
Post a Comment