Scam phone numbers
Scam phone numbers : ఈ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఆన్సర్ చేయొద్దు.. ఎత్తారో మీ ఖాతా మొత్తం ఖాళీ.
అంతర్జాతీయ నెంబర్లతో కాల్స్ వస్తున్నాయా? ఒక్కసారి రింగ్ ఇచ్చి కట్ చేస్తున్నారా? తిరిగి ఫోన్ చేస్తే మాట్లాడటం లేదా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
అవును నమ్మలేకపోతున్నారా.. నిజం.. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది.. దీని వెనక జరిగే మోసం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. నిజానికి “వాంగిరి” అనే అంతర్జాతీయ వన్-రింగ్ కాల్ స్కామ్‌లో భాగంగా ఈ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. వాంగిరి అనేది జపాన్ నుండి వచ్చిన స్కామ్ పేరు. వన్ రింగ్ అండ్ కట్ అని దీని అర్ధం. నిజానికి ఈ కాల్స్ వెనుక జరిగేది ఏంటంటే.. ఒక రింగ్ ఇచ్చి తిరిగి మీరు కాల్ చేసేలా ప్రేరేపిస్తారు. దీనితో అనుకోని రీతిలో ఛార్జీలు మీపై మోపుతారు.
ఫిబ్రవరి 2018లో ట్రిపుల్ హాక్ అనే వెబ్‌సైట్.. పాపువా న్యూ గినియా, స్లోవేనియా, కాంగో, బెల్జియం దేశాల నుంచి ఎక్కువగా వచ్చాయని గుర్తించింది అయిత్ ఇప్పుడు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విదేశీ కంపెనీలు డబ్బు సంపాదించడానికి ఏం చేస్తున్నారో ఈ స్కామ్ లో క్లియర్ గా కనిపిస్తుంది.
అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ లో ఒకటి లేదా రెండు రింగ్స్ ఇచ్చి కట్ చేస్తారు. ఇక ఈ కాల్ చూసిన వ్యక్తి తిరిగి కాల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ వెంటనే అంతర్జాతీయ హాట్‌లైన్‌కి మీ కాల్ కనెక్ట్ అవుతుంది. దాంతో పాటు కనెక్ట్ చేయడానికి కావాల్సిన డబ్బులు సైతం వసూలు చేస్తారు. మిమ్మల్ని అలాగే ఫోన్ కాల్ లో నుంచి చాలాసేపు ఇబ్బంది పెట్టి.. మీ బిల్లుపై ప్రీమియం ఛార్జీలు పడేలా చేస్తారు. ఈ స్కాంలో మీరు పడొద్దు అనుకుంటే అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేయొద్దు.. తిరిగి కాల్ చేస్తే ప్రయత్నం కూడా చేయొద్దు.
స్కామ్ ఫోన్ నంబర్‌లు –
+1 కోడ్ తో వచ్చే ఎన్నో కాల్స్ ను లిఫ్ట్ చేయకూడదు. అందులో ముఖ్యంగా ఏ కోడ్ ఏ దేశానికి చెందిందంటే
232 -సియెర్రా లియోన్
242 – బహామాస్
246 – బార్బడోస్
268 – ఆంటిగ్వా
284 – బ్రిటిష్ వర్జిన్ దీవులు
345 - కేమన్ దీవులు
441 – బెర్ముడా
473 – గ్రెనడా, కారియాకౌ మరియు పెటిట్ మార్టినిక్
649 – టర్క్స్ మరియు కైకోస్
664 – మోంట్సెరాట్
721 – సింట్ మార్టెన్
758 – సెయింట్ లూసియా
767 – డొమినికా
784 – సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్
809, 829, 849 - డొమినికన్ రిపబ్లిక్
868 – ట్రినిడాడ్ మరియు టొబాగో
869 – సెయింట్ కిట్స్ మరియు నెవిస్
876 – జమైకా
ఇక ఇలాంటి నెంబర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. దీని వలన అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉండటంతో పాటు స్కామర్స్ బారిన పడే ఛాన్స్ సైతం ఉంటుంది. ఏది ఏమైనా తెలియని నెంబర్ల నుంచి ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని టెలికాం సంస్థలతో పాటు ట్రాయ్ సైతం హెచ్చరిస్తుంది.
0 Response to "Scam phone numbers"
Post a Comment