The tax department will give you a huge shock.
Income Tax: పన్ను శాఖ భారీ షాక్.. అలా మనీట్రాన్సాక్షన్స్ చేస్తే 100% పెనాల్టీ, వేట మెుదలు.
ఆదాయపు పన్ను శాఖ భారతదేశంలో పన్ను ఎగవేతదారులను గుర్తించటానికి కొత్త మార్గాల్లో వస్తోంది. ఈ క్రమంలో ఏఐ టూల్స్, ఇతర మార్గాల నుంచి సేకరిస్తూనే ఉంటుంది.
వీటిని క్రోడీకరించటం ద్వారా పన్ను ఎగవేతదారులను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ ప్రస్తుతం విస్తృత వ్యాప్తిని అందుకున్నాయి. అయితే ఫిజికల్ క్యాష్ లావాదేవీలను తగ్గించాలని పన్ను అధికారులు చూస్తున్నారు. నగదు లావాదేవీలకు వ్యతిరేకంగా బలమైన హెచ్చరికను జారీ చేస్తోంది. ఈ రూల్స్ పాటించకపోవటం వల్ల చట్టపరంగే ఎదురయ్యే నష్టాలు, జరిమానాల గురించి హెచ్చరిస్తోంది. కొన్ని డిడక్షన్లు, అలవెన్సులు డబ్బు రూపంలో చెల్లింపులకు అనుమతి లేదని పేర్కొంది. వీటిని అతిక్రమిస్తే 100 శాతం జరిమానా విధించబడుతుందని పన్ను శాఖ పేర్కొంది.
"నగదు లావాదేవీలకు 'నో' చెప్పండి. లావాదేవీ విలువలు తక్కువగా ఉన్నప్పుడు వ్యక్తులు నగదును స్వీకరించడానికి, చెల్లించడానికి , బదిలీ చేయడానికి ఇష్టపడతారు. అయితే ఇది ప్రమాదాలతో కూడుకున్నదని డిపార్ట్‌మెంట్ జనవరి 2, 2025న విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది. అయితే ఏఏ లావాదేవీలు చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే వివరాలను ప్రజలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.
సెక్షన్ 269SS: రూ.20,000 కంటే ఎక్కువ నగదు రుణాలు, డిపాజిట్లు లేదా నిర్దిష్ట మొత్తాలకు అనుమతి లేదు.
సెక్షన్ 269ST: ఒక రోజు, ఒకే లావాదేవీ లేదా సంబంధిత లావాదేవీలలో రూ.2 లక్షల+ నగదు రసీదులు లేనప్పుడు
సెక్షన్ 269T: రూ.20,000 (వడ్డీతో సహా) కంటే ఎక్కువ రుణాలు లేదా డిపాజిట్లకు నగదు తిరిగి చెల్లించడానికి అనుమతి లేదు.
సెక్షన్ 40A(3): రూ.10,000 (ట్రాన్స్‌పోర్టర్‌లకు రూ.35,000) కంటే ఎక్కువ నగదు చెల్లింపులకు వ్యాపార ఖర్చు తగ్గింపులు లేవు.
సెక్షన్ 80G: రూ.2,000 కంటే ఎక్కువ నగదు విరాళాలకు మినహాయింపులు అందించబడవు. పైన పేర్కొన్న లావాదేవీల్లో అతిక్రమణలు జరిగితే పన్ను శాఖ 100 శాతం జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ఆదాయపు పన్ను శాఖ మాజీ చీఫ్ కమీషనర్ రామకృష్ణన్ శ్రీనివాసన్, నగదు రుణ పరిమితుల గురించి తెలియని ఒక మాజీ నటి, ఆమె అంగీకరించిన రుణానికి సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించిన సంఘటన గురించి ఉదహరించారు. అలాగే యూపీఐ, NEFT, BHIM వంటి డిజిటల్ చెల్లింపు ఎంపికలను అందించడానికి సెక్షన్ 269SU కింద రూ.50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్‌లు కలిగిన వ్యాపారాలు తప్పనిసరి. ఈ రూల్స్ పాటించకపోతే రోజువారీ రూ.5,000 జరిమానా విధించవచ్చని పన్ను శాఖ పేర్కొంది. పన్ను శాఖ తాజా చర్యలు డిజిటల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌ల వైపు మళ్లించడం, నగదు లావాదేవీలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉన్నాయి.
0 Response to "The tax department will give you a huge shock."
Post a Comment