Today is the new moon .. Don't even do these things. Let's find out what is good
Mauni Amavasya: ఈరోజే మౌని అమావాస్య.. ఈ ఒక్క మంత్రం చదివితే.. దోషాల నుంచి విముక్తి!
Mouni Amavasya: ఈరోజే మౌని అమావాస్య.. పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు. ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం
మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల పౌర్ణమి అమావాస్య వంటివి వస్తూనే ఉంటాయి. ఇలా ప్రతినెల అమావాస్య వస్తున్నప్పటికీ మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదని పవిత్రమైనదని చెప్పవచ్చు.
మరి మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ మౌని అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది.. మరి రేపు రాబోయే మౌని అమావాస్య రోజు మనం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే
చేయకూడని పనులు
మౌని అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అలాంటి వాటిలో ఉదయం నిద్ర లేవడం అనేది కూడా ఒకటి పొరపాటున కూడా అమావాస్య రోజు ఎవరు కూడా ఆలస్యంగా నిద్రలేకూడదు ఇలా నిద్రలేయటం దరిద్రంగా పరిగణించబడుతుంది అందుకే సూర్యోదయాన్ని కంటే ముందుగానే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య దేవుడికి అర్ఘ్యం ఇవ్వాలి.
మౌని అమావాస్య అంటే మౌనమని అర్థం అందుకే ఈరోజు మౌనవ్రతం పాటించడం ఎంతో మంచిది అలాగే ఈరోజు ఎవరిని కూడా దురుసుగా దూషించకూడదు.
ఇక ఈ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి తల్లిదండ్రులేని వారు వారి పితృదేవతలకు తర్పణాలు పెట్టడం ఎంతో మంచిది. ఇక ఈ మౌని అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్ర అసలు చేయకూడదు అలాగే రాత్రి పడుకునేటప్పుడు భోజనం చేయకుండా నిద్రపోవట మంచిది.
ఇక అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోకూడదు అలాగే తలకు నూనె కూడా రాయకూడదు. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గడ్డం తీయడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే అష్ట దరిద్రాలు మనల్ని వెంటాడుతాయి.
ఈ అమావాస్య రోజు సాయంత్రం పసి పిల్లలను బయటకు తీసుకొని రాకూడదు అలాగే అమావాస్య రోజు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
చేయాల్సిన పనులు
మౌని అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి నదీ స్నానాలను ఆచరించడం ఎంతో మంచిది. ఇలా నది స్నానాలు ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాలు అలాగే పితృదేవతలను కూడా పూజించడం ఎంతో మంచిది.
పితృ దోషాలతో బాధపడేవారు ఈ మౌని అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం వదిలి నమస్కరించట వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. ఇకపోతే ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం కూడా ఎంతో శుభప్రదంగా పరిగణింపబడుతుంది.
చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పితృ దోషాలు తొలగిపోవడం కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఇక పితృ సమస్యలు దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజున నలుపు రంగు దుప్పట్లను అలాగే
నల్ల నువ్వుల లడ్డులు నువ్వుల నూనె, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయటం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు.
ఇక ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేయకపోవడం ఎంతో మంచిది అలాగే ఈ అమావాస్య లక్ష్మీదేవి పూజకు కూడా ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు.
"చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య*
పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి, సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి, పితృ తర్పణం గావిస్తే వారి పితరులు 21తరాల వారు నరక లోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్దించగలని పురాణ కథనాలు. గౌతముడు కొనితెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొని పోయి ఏడు స్థలాలలో సంగిమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితయై గోదావరి యగ్రము వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వసిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారివారి పేర్లతో పరమగుతున్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం/తీర్థాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. రేవా నది అనగా నర్మదానదీ తీరంలో తపస్సు, గంగానదీ తీరంలో మరణం, కురుక్షేత్రంలో దానం పుణ్యప్రదాలు కాగా, గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి. కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని ‘సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర’ లేదా ‘సప్త సాగర యాత్ర’ అంటారు. సంతానం, తదితర కోరికలు ఈడేరడానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్దంగా వస్తున్నది. సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది. ఏడు తావులు చూసుకుని, ప్రాయకంగా మాఘ శుక్ల ఏకాదశి నాటికి వశిష్టా సాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరతారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకాదశిని ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటి. ఇలా సప్త సాగర యాత్రకు ఆది, తుది దినాలు పర్వదినాలుగా పరిగణింప బడతాయి. చొల్లంగి అమావాస్య అనే పేరు రావడానికి మహత్తుగల చొల్లంగికి ప్రసిద్ధి, తుల్యభాగ వల్ల కలుగుతున్నది. ‘‘మహోదయ నామాలభ్య యోగ పుణ్యకాల: అమావాస్యా సోమ వాసర వ్రతమత: పద్మయోగ పుణ్యకాల’’మని పేర్కొనబడింది. రవి శ్రవణ వ్యతీపాతము ఈనాడు జరిగితే అది మహోదయ యోగము, పద్మయోగ పుణ్యకాలము కలుగుతుంది. పుష్య కృష్ణ అమావాస్య ప్రస్తుతం శుక్రవారం వస్తున్నందున మహోదయ పర్వకాలంగా, పుణ్యప్రదమైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించు కోవాలని శాస్త్ర వచనాలు.
చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య కూడా అంటారు. ఈరోజు మునులు, యోగులు , శాస్త్రం తెలిసిన వారు తమ ఇష్టమైన దైవాలను తమదైన సాధన మార్గాల్లో జపిస్తారు. స్త్రోత్రం చేస్తూ రోజంతా గడుపుతారు. ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటారు. మంత్రాన్ని అనుస్థానం చేస్తారు. అందుకే చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. సంతాన ప్రాప్తిని కోరుకునే వారు చొల్లంగిలోని ఆంజనేయస్వామిని ప్రార్థించి దీక్షను చేపడుతూ ఉఁటారు. చొల్లంగితో మొదలుపెట్టి అంతర్వేది వరకు గోదావరి సంచార యాత్ర చేస్తూ ఆలయాలను సందర్శించుకుంటూ సప్తసంగమ యాత్ర చేస్తుంటారు. ఆ యాత్ర కూడా చొల్లంగి నుంచే ప్రారంభమవడం సంప్రదాయంగా వస్తోంది.
0 Response to "Today is the new moon .. Don't even do these things. Let's find out what is good"
Post a Comment