Trump Big Shock to Indians!
Donald Trump: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా మన దేశం మీద. పౌరసత్వం రద్దుపై ట్రంప్ ఆర్డర్ లక్షలాది మంది ఇండియన్స్ ను భయపెడుతోంది.
ఈ నిర్ణయం వల్ల మన దేశం నుంచి చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్న లక్షల మంది యువతీ యువకులకు, వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం దొరకడం ఇక ఆసాధ్యం అవుతుంది. వందేళ్లుగా అమల్లో ఉన్న పౌరసత్వ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. దీంతో ఉన్నత చదువులు చదివి, కష్టపడి పనిచేస్తూ అమెరికా అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు అక్కడ ఎప్పటికీ పరాయివారిగానే బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ రోజైనా అమెరికా తరిమేస్తే తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి రావాల్సిందే.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో బ్రేక్.
అమెరికాలో ఇప్పటిదాకా ఆ దేశ పౌరుల పిల్లలకే కాకుండా ఆ గడ్డపై జన్మించిన విదేశీయుల పిల్లలకు కూడా పౌరసత్వం అటోమేటిక్ గా లభిస్తుంది. అమెరికా నేలపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు అమలవుతున్న ఈ హక్కుకు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో బ్రేక్ పడింది. తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోతే పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించదు. తండ్రి శాశ్వత నివాసి అయి తల్లి తాత్కాలిక వీసా మీద ఉన్నా సిటిజన్షిప్ దక్కదు.
భారతీయులపై ప్రభావం ఎంత?
అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 55 లక్షల మంది ఇండియన్స్ అక్కడ నివసిస్తున్నారు. అక్కడి మొత్తం జనాభాలో 1.5 శాతం ఇండియన్స్. వీరిలో 34 శాతం మంది అక్కడ పుట్టినవారు కాగా.. మిగిలినవారంతా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వెళ్లిన వారే. H1B వీసాపై అమెరికాలో స్థిరపడి గ్రీన్ కార్డుకోసం ఎదురుచూస్తున్న వారికి పుట్టిన పిల్లలకు కూడా ఇకపై అమెరికా పౌరసత్వం లభించదు.
ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ఇండియన్స్కు, వారి పిల్లలకు గ్రీన్ కార్డు రావడం ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటిదాకా అమెరికాలో పుట్టిన పిల్లలు అక్కడి పౌరులు అవుతారు కాబట్టి 21 ఏళ్ల వయసు తర్వాత వాళ్లు పేరెంట్స్ కు సిటిజన్షిప్ ఆఫర్ చేసే అవకాశం ఉండేది. అమెరికా తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడా ఛాన్స్ లేదు. దీంతో పేరెంట్స్ భారత్లో, పిల్లలు అమెరికాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అమెరికాలో కొన్నేళ్లుగా బర్త్ టూరిజం ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. మెరుగైన జీవితం ఉంటుందనే ఆశతో ఇండియా నుంచి చాలామంది మహిళలు డెలివరీ సమయానికి US వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని కంపెనీలు ఈ బర్త్ టూరిజాన్ని నిర్వహిస్తున్నాయి. 8 వేల డాలర్లకి హోటల్, వైద్య సదుపాయాలను అందిస్తాయి. ఇండియా, చైనా, మెక్సికో సహా అనేక దేశాల నుంచి గర్భిణులు బర్త్ టూరిజంలో అమెరికా వెళుతున్నారు. 2019లో వేరే దేశాల నుండి యూఎస్ వచ్చి 12,000 మంది పిల్లలకు జన్మనిచ్చారు. 2017లో ఈ సంఖ్య 10,000, 2007లో 7,800గా ఉంది.
ఫిబ్రవరి 20నుంచి ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ అమలులోకి రానుంది. దీంతో నెలలు నిండకముందే సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. భారతీయ దంపతుల నుంచి ‘ముందస్తు డెలివరీ’ అభ్యర్థనలు ఎక్కువయ్యాయని అమెరికా డాక్టర్స్ చెబుతున్నారు. 8నెలల గర్భవతులు బర్త్ రైట్ సిటిజెన్ షిప్ ఆదేశాలు అమలులోకి రాకముందే సిజేరియన్ చేయించుకుని బిడ్డకు జన్మినివ్వాలని భావిస్తున్నారు.
అమెరికా ప్రజలకూ ఇబ్బందే..
జన్మతః పౌరసత్వాన్ని నిలిపివేస్తే ఆ ప్రభావం అమెరికా పౌరులపై కూడా పడుతుంది. లోకల్ అమెరికన్స్ కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారే అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం అంత ఈజీ కాదు. రాజ్యాంగాన్ని సవరించాలంటే హౌజ్, సెనేట్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం ఉండాలి. దాంతోపాటు రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడొంతులు ఆమోదించాలి. కొత్త సెనేట్లో డెమొక్రాట్లకు 47 స్థానాలు ఉండగా రిపబ్లికన్లకు 53 స్థానాలున్నాయి. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేషన్స్లో డెమొక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. దీంతో రాజ్యాంగ సవరణ అనుకున్నంత ఈజీ కాదని తెలుస్తోంది.
అధికారం చేపట్టిన రోజే ట్రంప్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు. అవేంటో చూద్దాం రండి.
WHOకు గుడ్బై..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగింది. ఇక మీదట WHOకు అమెరికా నుంచి ఆర్థిక సహాయం అందదు. దీని ఎఫెక్ట్ ఈ సంస్థ అమలుచేస్తున్న చాలా పథకాల మీద పడుతుంది. కరోనా సమయంలో ప్రపంచ దేశాలమధ్య సమాచారం, మందుల పంపిణీతోపాటు రీసెర్చ్లో WHO కీలక పాత్ర పోషించింది.
టిక్ టాక్కు సపోర్ట్.
అమెరికాలో బ్యాన్ చేసిన టిక్ టాక్కు ట్రంప్ మళ్లీ ప్రాణం పోశారు. ఈ చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్కు ఆయన 75 రోజుల టైమ్ ఇచ్చారు. ఈలోగా అమెరికా నిబంధనలకు అనుగుణంగా టిక్టాక్లో మార్పులు చేయాలని సూచించారు. అప్పటివరకు దానిపై ఎలాంటి చర్య తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. టిక్టాక్ ను ఎలాన్ మస్క్ కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రీన్ ల్యాండ్ పై కన్ను.
గ్రీన్ ల్యాండ్ తమకు ఇవ్వాల్సిందేనని ట్రంప్ డెన్మార్క్కు అల్టిమేటం జారీ చేశారు.ఈ ప్రాంతాన్ని అమెరికాకు ఇచ్చేస్తే డెన్మార్క్కే ఉపయోగం అంటున్నారు. ఈ ప్రాంతంలో చైనా, రష్యా యుద్ధనౌకలు మోహరించి ఉన్నాయని, దీనివల్ల తమ దేశానికి భద్రత లేకుండా పోయిందని అన్నారు.
కెనడా–మెక్సికోపై భారీ ట్యాక్సులు.
మొదటి నుంచి చెబుతున్నట్టుగానే సరిహద్దు దేశాలైన కెనడా, మెక్సికోలపై సుంకాన్ని పెంచుతూ ఆర్డర్లు పాస్ చేశారు ట్రంప్. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించారు.
చైనా పైనా ట్రంప్ గురి.
అదనపు టారీఫ్లు విధించే అంశంలో చైనాపై గురిపెట్టారు ట్రంప్. ఆ దేశంపై వచ్చేనెల నుంచి ట్యాక్స్ లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డ్రాగన్కు ఫిబ్రవరి ఫీవర్ పట్టుకుంది. ఫెంటానిల్ డ్రగ్ను చైనా, మెక్సికో, కెనడాకు సప్లయ్ చేస్తోందంటూ 10శాతం అడిషనల్ ట్యాక్స్ విధించబోతున్నారు. దీనిని ఫిబ్రవరి 1నుంచి అమలు చేసే ఛాన్స్ ఉంది.
ఒన్లీ టూ జెండర్స్.
అమెరికాలో ఇక మీదట రెండు జెండర్లు మాత్రమే ఉంటాయి. థర్డ్ జెండర్ ను రద్దు చేశారు ట్రంప్. పురుషులు, మహిళలకు మాత్రమే అమెరికాలో సౌకర్యాలు లభిస్తాయని తేల్చి చెప్పారు. అమెరికా సైన్యంలో ఉన్న 15వేల మంది ట్రాన్స్ జెండర్లను తొలగించబోతున్నారు.
చైనా పైనా ట్రంప్ గురి..
అదనపు టారీఫ్లు విధించే అంశంలో చైనాపై గురిపెట్టారు ట్రంప్. ఆ దేశంపై వచ్చేనెల నుంచి ట్యాక్స్ లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డ్రాగన్కు ఫిబ్రవరి ఫీవర్ పట్టుకుంది. ఫెంటానిల్ డ్రగ్ను చైనా, మెక్సికో, కెనడాకు సప్లయ్ చేస్తోందంటూ 10శాతం అడిషనల్ ట్యాక్స్ విధించబోతున్నారు. దీనిని ఫిబ్రవరి 1నుంచి అమలు చేసే ఛాన్స్ ఉంది.
.
0 Response to "Trump Big Shock to Indians!"
Post a Comment