Vasant Panchami
Vasant Panchami : వసంత పంచమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? ఆరోజున ఏమి చేయాలో వివరణ.
మాఘ శుద్ధ పంచమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో 'వసంత పంచమి'గా ఎంతో ఘనంగా సరస్వతి దేవిని కొలుస్తారు.
ఈ పర్వదినం వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది కనుక వసంత పంచమి నాడు విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని చాలామంది నమ్మకం.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న(ఆదివారం) తేదీన వసంత పంచమి వచ్చింది. అందుకే ఆ రోజున తమ చిన్నారులకు ప్రత్యేకంగా సరస్వతీ ఆలయాల్లో పూజలు చేయిస్తారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ఆలయంలో ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వసంత పంచమి నాడు అక్షరానికి అధిదేవత అయిన సరస్వతి దేవి ముందు పుస్తకాలు, పెన్నులు పెట్టి ఆరాధిస్తారు.
0 Response to "Vasant Panchami "
Post a Comment