Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 AP budget allocations

 ఏపి బడ్జెట్ కేటాయింపులు

AP budget allocations

మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.

 ఏ శాఖకు ఎంత కేటాయించారంటే.. 

▪️పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు

▪️వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు

▪️పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు

▪️జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు

▪️మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు

▪️విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు

▪️వ్యవసాయానికి రూ.11,636 కోట్లు

▪️సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు

▪️ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు

▪️రవాణా శాఖకు రూ.8,785 కోట్లు

▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు

▪️పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు,

▪️స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు

▪️ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు రూ.300 కోట్లు

▪️ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు

▪️మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు

▪️తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు

▪️అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు

▪️దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు

▪️రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు

▪️బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు

▪️పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు

▪️చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు

▪️RTGSకు రూ.101 కోట్లు

▪️ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు

▪️అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు

▪️పోలవరం కోసం రూ.6,705 కోట్లు

▪️జల్‌జీవన్‌ విషన్‌కు రూ.2,800 కోట్లు

▪️వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు

▪️పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు

▪️బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు

▪️ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు

▪️ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు

▪️అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు

▪️మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు

▪️వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు

▪️పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు

▪️ఆర్‌ అండ్‌ బీకి రూ.8,785 కోట్లు

▪️యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు

▪️తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు

▪️నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు

▪️డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు

▪️రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.500 కోట్లు

▪️ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు

▪️ITI, IITల కోసం రూ.210 కోట్లు

▪️దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు

▪️రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు

▪️ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు

▪️ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు

▪️మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు

▪️ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " AP budget allocations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0