Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Located behind the colors of mile stones. Original

మైలు రాళ్ళ రంగుల వెనుక ఉన్న. అసలుకద

 సాధారణంగా మనం రోడ్ల మీద వెళ్తుంటే మైలు రాళ్లు కనిపిస్తాయి. ముందుగున్న నగరాలు, పట్టాణాలు, గ్రామాలకు సంబంధించి ఇంకా ఎంతదూరం వెళ్లాలో ఆ మైలు రాళ్లు సూచిస్తాయి. వాటి ఆధారంగా చాలా మంది ప్రయాణం చేస్తుంటారు. ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వాళ్లు సైతం మైలు రాళ్లు, సైన్ బోర్డులు చూసి ఎలా వెళ్లాలో తెలుసుకుంటారు. అయితే, రోడ్ల మీద వెళ్లే సమయంలో మైలు రాళ్లకు రకరకాల రంగులు ఉంటాయి. ఒక్కో రంగు వెనుక ఒక్కో కథ ఉంటుంది. ఇంతకీ ఏ రంగు రాయి వెనుక, ఏ కథ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

పలు రంగుల్లో మైల్ స్టోన్స్

రోడ్ల మీద కనిపించే మైల్ స్టోన్లలో కొన్ని పసుపు రంగులో ఉంటాయి. మరికొన్ని ఆరెంజ్ కలర్, ఇంకొన్ని నలుపు, ఆకుపచ్చ, నీలం రంగులో ఉంటాయి. అసలు ఎందుకు ఇన్ని కలర్స్ అని చాలా మందిలో అనుమానం కలుగుతుంది. కానీ, ఎవరు పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయరు. కానీ, ఒక్కో రంగు మైల్ స్టోన్ వెనుక ఒక్కో కథ ఉంటుంది.

⦿ పసుపు రంగు మైల్ స్టోన్

ఒక మైలు రాయి కింద తెలుపు రంగులో ఉండి, పైన పసుపు రంగులో ఉంటే మనం నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్మించే రోడ్ల మీద మాత్రమే ఈ రకమైన మైలు రాళ్లు ఉంటాయి. ఆ ఎల్లో కలర్ మీద నేషనల్ హైవే నెంబర్ కూడా ఉంటుంది. ఈ రహదారుల నిర్వహణ బాధ్యతను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది.

⦿ ఆకుపచ్చ రంగు మైల్ స్టోన్

ఒక మైలు రాయికి కింద తెలుపు రంగు ఉండి, పైన గ్రీన్ కలర్ ఉంటే అది స్టేట్ హైవే అని తెలుసుకోవాలి. గ్రీన్ పార్ట్ మీద స్టేట్ హైవే నెంబర్ కూడా ఉంటుంది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి.

⦿ నీలం రంగు మైల్ స్టోన్

ఒక మైలు రాయికి కింద తెలుగు రంగు ఉండి, పైన నీలం రంగు ఉంటే మనం డిస్ట్రిక్ రోడ్డు మీద ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యతను ఆయా జిల్లాలు చూసుకుంటాయి.

⦿ నలుపు రంగు మైల్ స్టోన్

ఇక మైల్ స్టోన్ లో కింద తెలుపు ఉండి, పైన నలుపు రంగు ఉంటే నగరంలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. నగరాల్లో మాత్రమే ఇలాంటి మైల్ స్టోన్స్ కనిపిస్తాయి.

⦿ ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్

మైలు రాయికి కింద తెలుపు రంగు, పైన ఆరెంజ్ కలర్ ఉంటే, అవి గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లుగా గుర్తించాలి.

⦿ పూర్తి ఆకుపచ్చ రంగు మైల్ స్టోన్

ఇక ఒక మైల్ స్టోన్ కు కింద అంతా ఆకుపచ్చ రంగు ఉండి, పైన తెలుపు రంగు ఉంటే ఫారెస్ట్ రోడ్డులో ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. అడవుల్లో మాత్రమే ఇలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Located behind the colors of mile stones. Original"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0