Pay Electricity Bill Through Whatsapp
Pay Electricity Bill Through Whatsapp: వాట్సాప్ లోనే కరెంట్ బిల్లు పే చేయవచ్చు వివరణ.
Pay Electricity Bill Through Whatsapp :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రంలోని ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇక నుంచి కరెంట్ బిల్లు వాట్సాప్ నుంచే కట్ట వచ్చును. అలాగే మీ కరెంట్ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎంత బిల్ వచ్చింది ఏంటి తదితర విషయాలు తెలుసుకోవచ్చును.. మరిన్ని వివరాలకు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వగలరు.
What is WhatsApp Governance
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ సిటిజన్స్ అందరికీ అన్ని రకాల సర్వీసులు వాట్సాప్ లోనే అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో దాదాపుగా 161 సర్వీస్ లను వాట్సాప్ లోకి తీసుకుని వచ్చేదానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి సిటిజన్స్ కి కావలసిన క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, ఇంకా చాలా సర్వీస్ లు ఫ్రీగా వాట్సప్ లో నుంచి వినియోగించుకోవచ్చును.
Pay Electricity Bill Through Whatsapp Overview
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు కొత్తగా వాట్సప్ గవర్నెన్స్ ను తీసుకోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా మన మొబైల్లోనే జస్ట్ హాయ్ అని మెసేజ్ చేసి మన ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎంత బిల్ వచ్చింది, ఎవరి పేరు మీద ఉంది, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. మరియు వాట్సాప్ నుంచే కరెంట్ బిల్లు పే చేయవచ్చును. బయట ఆన్లైన్ సెంటర్స్ లోకి, ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు.. జస్ట్ మీ మొబైల్ లో వాట్సాప్ ఉంటే చాలు.
ఈ Pay Electricity Bill Through Whatsapp మీ కరెంట్ బిల్లుకి ఈనెల ఎంత కరెంటు బిల్లు అమౌంట్ వచ్చింది, మీరు పే చేస్తే ఆ రిసిప్ట్, ఇంకా పే చేయకపోతే పే చేయొచ్చు మీ కరెంట్ బిల్లుకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీ మొబైల్ లోని తెలుసుకొండి.
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ పేరు ఈ పోస్టులో కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి.
Step 2 :: నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత, చాట్ లోకి వెళ్లి ఆ నెంబర్ కి హాయ్, గాని లేదా మీరు ఏ మెసేజ్ చేసినా మీకు వాట్సప్ గవర్నెన్స్ నుంచి రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించిన సేవలు ఎంచు కోవాలి.
Step 3 :: ఫైన్ ఇమేజ్లో చూపించిన విధంగా దయచేసి ఒక సేవను ఎంచుకోండి దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ప్రభుత్వానికి సంబంధించి సర్వీసులు కనిపించడం జరుగుతుంది.
అవి : విద్యా సేవలు, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదులు పరిష్కరణ సేవలు, APSRTC సేవలు, ఎనర్జీ సేవలు, CDMA సేవలు, రెవిన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు.
Step 4 :: ఇప్పుడు ఇందులో మనము ఎనర్జీకి సంబంధించిన సేవలను క్లిక్ చేయాలి. చేయగానే క్రింది విధంగా మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది.
Step 5 :: పైన ఇమేజ్ లో మార్క్ చేసిన దగ్గర మీ యొక్క కరెంట్ బిల్లు నెంబరు, అనగా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తానే ఈ క్రింది విధంగా మీకు రావడం జరుగుతుంది.
Step 6 :: పైన ఫోటోలో చూపించిన విధంగా బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే నిర్ధారించండి అనే బటన్ పై క్లిక్ చేయండి.
Step 7 :: తర్వాత మళ్లీ మీకు కొత్త స్క్రీన్ ఓపెన్ అవటం జరుగుతుంది. అక్కడ మీకు ఇప్పుడు కొనసాగించండి అని రావడం జరుగుతుంది. ఆ బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది.
Step 8 :: అక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.. ఇందులో మీరు ప్రస్తుతం మీ ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. లేదు గత నెల బిల్లులు చూడాలనుకుంటే రెండు ఆప్షన్ పై క్లిక్ చేయండి. ప్రస్తుత మీకు ఈ నెల మీకు ఎంత కరెంటు బిల్లు వచ్చిందో తెలుసుకోవాలను కొంటే మూడో ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Note :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీరు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించి కరెంట్ బిల్లు ఎవరి పేరు మీద ఉంది. ఎంత బిల్లు వచ్చింది, లాస్ట్ డేట్ ఎప్పుడు పూర్తి వివరాలన్నిటి ఓపెన్ అవుతాయి.
Step 9 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా వచ్చిన తర్వాత పూర్తయింది పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ క్రింది విధంగా కొత్త డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 10 :: పైన ఫోటో నీ జాగ్రత్తగా పరిశీలించి యుపిఐ చెల్లింపులు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ కరెంట్ బిల్లుకు సంబంధించిన అమౌంట్ పే చేయమని అడుగుతుంది.
Step 11 :: మీరు ఇక్కడి నుంచే కరెంట్ బిల్లు పే చేయాలి అనుకుంటే Review and Pay పైన క్లిక్ చేయండి.. ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ మొబైల్ లో ఉన్న phonepe, google pay, ఇంకా ఏవైనా పేమెంట్ ఆప్స్ ఉంటే వాటి లిస్ట్ రావడం జరుగుతుంది మీకు నచ్చిన యాప్ ని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ పే చేయండి. ఈ క్రింద ఇచ్చిన నెంబర్ ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీ వాట్సాప్ లోకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
0 Response to "Pay Electricity Bill Through Whatsapp"
Post a Comment