Pooja Room: Do you have a puja in the kitchen room .. But let's find out.
Pooja Room: కిచెన్ రూమ్ లోనే పూజగది కూడా ఉందా.. అయితే ఇది తెలుసుకుందాం.
వాస్తు ప్రకారంగా కొన్ని రకాల విషయాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుంది అంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తు నియమాలు పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందట.
వాస్తు ప్రకారం ఇంట్లో దేవుడు గది విషయంలో కూడా కొన్ని విషయాలను పాటించాలట. మరి ఇంట్లో పూజగది ఎక్కడ ఉండాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా లివింగ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు, కిచెన్ నుంచి దేవుడి గది వరకు ప్రతి గది ఇంట్లో సామరస్యాన్ని కాపాడటంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. అంతేకాదు ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందట.
ప్రస్తుతం చాలామంది ఇంట్లో సరిగా ప్లేస్ లేకపోవడం వల్ల ఇక ఇంట్లో వంటగదిలోనే దేవుడి గుడిని నిర్మిస్తున్నారు. కానీ దేవుడి గుడి పరిశుభ్రంగా, ఎలాంటి వ్యసనాలు లేకుండా ఉండాలని పండితులు చెప్తారు. అయితే మరి వంటింట్లో దేవుడి గది ఉండటం మంచిదా కాదా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లో ఉండే దేవుడి గది ఇంట్లోని ఇతర గదులకు దూరంగా ఉండాలట. అలాగే పెద్ద పెద్ద శబ్దాలు లేని ప్రదేశంలోనే దేవుడి గుడిని నిర్మించాలని చెబుతున్నారు. పూజా గది ఎప్పుడూ కూడా మన మనస్సును ఉంచడానికి దోహదం చేస్తుందట. మన మనస్సు నిలకడగా, అశాంతిగా ఉన్నప్పుడు మనం ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుకుతుంటాం. అయితే ఇలాంటి పరిస్థితిలో పూజా గది మనకు చాలా ముఖ్యమైనదని చెబుతున్నారు. పూజా మందిరాన్ని ఇంట్లో ఒక పవిత్ర ప్రదేశంగా భావిస్తాము. ఈ స్థలంలోనే జనాలు మతపరమైన ఆచారాలు, ధ్యానం, పూజ చేస్తుంటారు.
ఇది ఆధ్యాత్మిక శక్తి, సానుకూలతలను కలిగించేదిగా భావిస్తారు. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది నిర్మలంగా ఉండాలి. ధ్యానం, పూజ ప్రశాంతంగా చేసుకోవడానికి అనువైన స్థలంలో ఉండాలి. పూజ గది ఇంటికి ఈశాన్య మూల, తూర్పు లేదా ఉత్తర మూలలో ఉండాలి. ఈ దిక్కులన్నీ పూజా స్థలానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు.
ఈ దిశలన్నీ శక్తి సహజ ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయని జ్యోతిష్యులు అంటారు. పూజ గదికి ఉత్తమమైన దిశ ఈశాన్య. ఈ దిశ కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిశలో పూజా గదిని నిర్మించాలట. అలాగే పూజా గది ఎప్పుడూ పరిశుభ్రంగా, చెత్తా చెదారం లేకుండా ఉండాలి. అలాగే దేవుడి గుడిలో ఎప్పుడు వెలుతురు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. పూజగది, వంటగది ఎప్పుడూ పక్కపక్కనే ఉండకూడదట. ఎందుకంటే వంటగది అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. కాబ్టటి వంటగదిలో పూజా గదిని నిర్శించడం వల్ల ఈ అంశాల మధ్య ఘర్షణ ఏర్పడుతుందట. ఇది ఇంట్లో సానుకూల శక్తిని దెబ్బతీస్తుందట. అంతేకాకుండా పూజా గదిని వంటగదికి దూరంగా ఉంచడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వంటగదిలో అన్ని రకాల ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ ప్రదేశంలో ప్రార్థనా స్థలం ఉంటే, అది ఆలయ పవిత్రతను కూడా ప్రభావితం చేస్తుందట. రెండింటి మధ్య సామరస్యాన్ని కాపాడటానికి వంటగది, ప్రార్థనా స్థలాన్ని కలిపి ఉంచకపోవడం మంచిది కాదట. వంటగదిలో ఉపయోగించే వస్తువులు పూజ గదికి అవసరమైన పవిత్రతకు, శుభ్రతకు సరిపోవు. కాబట్టి పూజ గదిని వంటగదిని ఒకేదగ్గర నిర్మించకూడదని చెబుతున్నారు.
0 Response to "Pooja Room: Do you have a puja in the kitchen room .. But let's find out."
Post a Comment