Schools: AP Education Department who issued new guidelines for schools. Implemented from today.
Schools: స్కూళ్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ విద్యాశాఖ. ఈరోజు నుంచే అమలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ స్కూళ్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రేపు జరగనున్న "పరీక్షా పే చర్చ" కార్యక్రమాన్ని విద్యార్థులు తప్పకుండా వీక్షించేలా అన్ని స్కూళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు RJD.. DEOలు.. స్కూల్ ప్రిన్సిపాళ్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం డీడీ న్యూస్.. డీడీ ఇండియా చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఫొటోలను SCERT AP మరియు MYGov పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
ప్రధాని మోదీ విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి నుంచి విముక్తి కలిగించే మార్గాలను ఈ కార్యక్రమంలో వివరించనున్నారు. ఇప్పటికే న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీ ప్రాంగణంలో "పరీక్షా పే చర్చ" 2025 టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఈ కార్యక్రమం ముందన్నింటికంటే భిన్నంగా 8 ఎపిసోడ్‌లుగా ప్రసారం కానుంది. ప్రతి ఎపిసోడ్‌లో విద్యార్థులు పరీక్షల సమయంలో ఎదుర్కొనే వివిధ సమస్యలకు పరిష్కారాలు.. మెమరీ పవర్ పెంచుకునే టెక్నిక్స్.. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడానికి చిట్కాలు తెలియజేస్తారు.
ప్రధాని మోదీ విద్యార్థులతో మమేకమై వారిలో స్వతంత్ర ఆలోచన పెంపొందించేందుకు.. ఒత్తిడిని తగ్గించేందుకు ప్రేరేపించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులు కూడా దీనిని ఆసక్తిగా వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి.. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
0 Response to "Schools: AP Education Department who issued new guidelines for schools. Implemented from today."
Post a Comment