Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Blood Dilution Foods  Blood Dilution Foods.. Frequent intake does not cause heart attack..!

 రక్తం పలుచన చేసే ఆహారాలు  రక్తాన్ని పలుచగా చేసే ఆహారాలు.. తరచూ తీసుకుంటే గుండె పోటు రాదు..!

బ్లడ్ డైల్యూషన్ ఫుడ్స్ బ్లడ్ డైల్యూషన్ ఫుడ్స్.. తరచుగా తీసుకోవడం వల్ల గుండెపోటు రాదు..!

మన శరీరంలో జీర్ణాశయం జీర్ణం చేసే ఆహారాలలో ఉండే పోషకాలను రక్తం గ్రహించి శరీర భాగాలకు చేరవేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది.

రక్తం మనకు ఇంధనం లాంటిది. కానీ కొన్ని కారణాల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. దీర్ఘకాలంలో ఇలా జరిగితే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను రక్తాన్ని పలుచగా చేసే ఆహారాలను మనం తరచుగా తినాలి. దీనితో రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసుకోవచ్చు. అయితే అందుకు ఏయే ఆహారాలు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల రక్తనాళాలు క్లియర్ అవడమే కాక గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.


చేపలు, పసుపు..


వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలు తింటే గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేసిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లామేటరీ సమ్మేళనాలుగా పనిచేస్తాయి. దీని వల్ల రక్తనాళాలు వాపులకు గురికాకుండా ఉంటాయి. దీంతో రక్తం పలుచబడుతుంది. బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. అలాగే పసుపును తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. పసుపులో కర్’క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ప్లేట్‌లెట్ సమ్మేళనంగా పనిచేస్తుంది. దీని వల్ల రక్తనాళాలు వాపులకు గురికాకుండా ఉంటాయి. దీంతో రక్తం పలుచబడుతుంది. బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. అలాగే పసుపును తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. పసుపులో కర్’క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ప్లేట్‌లెట్ సమ్మేళనంగా పనిచేస్తుంది. దీని వల్ల రక్తం పలుచగా మారుతుంది. నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. దీని వల్ల గుండె పోటు నివారించబడుతుంది.


అల్లం, వెల్లుల్లి..


మనం అల్లాన్ని రోజూ వంటల్లో వేస్తుంటాం. అయితే అల్లం రసాన్ని రోజూ సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అలాగే రక్తాన్ని పలుచగా చేసే గుణాలు కూడా అల్లానికి ఉంటాయి. కనుక అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. అలాగే రక్తాన్ని పలుచగా చేసి రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుంటే మేలు జరుగుతాయి. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్తం పలుచగా అయ్యేలా చేస్తుంది. దీనితో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారించవచ్చు.

పండ్లు, డార్క్ చాకొలెట్లు..

రోగ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బ్లూ బెర్రీలు, చెర్రీలు, స్ట్రా బెర్రీలు, రాస్ప్‌ బెర్రీలు ఈ కోవకు చెందుతాయి. వీటిల్లో ఉండే యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాలు రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డ కట్టకుండా చూస్తాయి. గుండె పోటు రాకుండా నివారించబడుతుంది. అలాగే డార్క్ చాకొలెట్‌లను తింటున్నా ఫలితం ఉంటుంది. డార్క్ చాకొలెట్లలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే రక్తం పలుచగా మారుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. డార్క్ చాకొలెట్లను తింటే గుండె పోటు రాకుండా నివారించవచ్చు. అదేవిధంగా ఆలివ్ ఆయిల్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇందులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేసి రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చూస్తాయి. గుండెతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు ఆహారాలను తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Blood Dilution Foods  Blood Dilution Foods.. Frequent intake does not cause heart attack..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0