Business Ideas: Top Business In India
బిజినెస్ ఐడియాస్: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు.
ఈ కంపెనీ ప్రారంభిస్తే వ్యాపారవేత్తగా మీకు లాభాల పంట పండటం ఖాయం. ఇదొక్కటేనా.. పర్యావరణవేత్తగానూ అందరూ మిమ్మల్ని ఆకాశానికెత్తేస్తారు.
140కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ప్రతి రోజూ వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతాయి. కంప్యూటర్లు, ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వేస్ట్) పెద్ద మొత్తంలోనే పేరుకుపోతున్నాయి. వీటిని రీసైకిల్ చేసే బిజినెస్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఆదాయం రావడం ఖాయం. ఎందుకంటే, మన దేశంలో ఇలాంటి కంపెనీలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మీరు చేయాల్సిన పనల్లా ఈ సౌకర్యాన్ని అందిపుచ్చుకోవడమే.. మరి, ఈ బిజినెస్ ఎలా మొదలుపెట్టాలంటే..
చెత్త వ్యాపారంతో.. కోట్ల ఆదాయం
ప్రస్తుతం భారతదేశంలో ఒక రోజులోనే 26 వేల టన్నుల పైనే ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇందులో దాదాపు సగం రీసైక్లింగ్ చేయకుండా వదిలేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ (e-waste) కూడా ఏటా దాదాపు 20 లక్షల టన్నులు వస్తోంది. ఈ వేస్టోజ్ నిర్వహించడమే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. ఈ విషయంలో మీరు సఫలమైతే ఈ వ్యాపారంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. దీనికి రాజస్థాన్‌కు చెందిన రాజ్ కుమార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఐటీ రంగం కారణంగా పెరిగిపోతున్న ఈ- వెస్ట్ రీసైకిల్ కావట్లనే ఆవేదనతో.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో తాను భాగం కావాలనుకున్నాడు. ఉద్యోగం వదులుకుని మరీ మొదట రాజస్థాన్‌లోని కుష్ఖేరాలో ఒక ప్లాంట్.. తర్వాత హర్యానాలోని గురుగ్రామ్‌లో మరో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ నెలకొల్పాడు. ప్రస్తుతం 200కు పైగా కంపెనీలతో టై అప్ అయ్యి.. ఈ-వెస్ట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని దాదాపు రూ.30 కోట్ల టర్నోవర్‌కు చేర్చారు.
ప్లాస్టిక్ లేదా ఈ-వేస్ట్ రీసైక్లింగ్ బిజినెస్ ఇలా ప్రారంభించండి.
చాలా కంపెనీలు ఈ- వ్యర్థాలను సాధారణంగా స్టోర్ రూంలో ఉంచి కొన్నాళ్లయ్యాక చెత్తలో పడేస్తుంటారు. వీటిని కొనుగోలు చేస్తే ఇరువురికి లాభాలు ఉంటాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది.
స్థానికంగా ఉండే ఐటీ, ఆటోమొబైల్, కన్సల్టింగ్, ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సెక్టార్, టెలికమ్యూనికేషన్స్, కన్సూమర్ గుడ్స్, హెవీ ఇండస్ట్రీస్ తదితర రంగాలకు చెందిన కంపెనీలతో ఈ-వేస్ట్ అమ్మేలా డీలింగ్ కుదుర్చుకోండి. వీటిని సేకరించాక మీరు ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి.. తిరగి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు ముడిపదార్థాలుగా మంచి రేటుకు అమ్ముకోవచ్చు.
ముద్రణలు: ఈ తరహా వ్యాపారాల కోసం కేంద్రప్రభుత్వం ముద్ర స్కీం కింద రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు అందిస్తోంది. ఈ డబ్బుతో రీసైక్లింగ్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేసి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
కంపెనీ : వ్యాపారం ప్రారంభించే ముందుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి కంపెనీ పేరు నమోదు చేయించుకుంటే ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. నలుగురి కంటే ఎక్కువ పనివారిని పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే
లేబర్ సర్టిఫికెట్ తప్పక తీసుకోవాలి. మీ సేవా కేంద్రం ద్వారా పెట్టుబడి ఖర్చు, ప్రభుత్వ సబ్సిడీ, రీసైక్లింగ్ యంత్రాలు ఎలా పొందాలి.. వాటి పూర్తి వివరాలను విచారించవచ్చు.
0 Response to "Business Ideas: Top Business In India"
Post a Comment