Do you know what happens to eat watermelon in the fridge.
ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను తింటే ఏమవుతుందో తెలుసా.
వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయల దాదాపు 90 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
ఇప్పటికే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి. వీటితో పాటు.. పుచ్చకాయలోని లైకోపీన్, బీటా - కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది. అయితే, చాలా మంది పుచ్చకాయను కట్ చేసి తిన్న తర్వాత కొంత వరకు ఫ్రిజ్‌లో పెట్టి తింటారు. అయితే, ఇలా తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే మీరు ఆ పని చేయరు. ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రమాదాలేంటో తెలుసుకుందాం.
ఫ్రిజ్‌లో పెట్టి తింటే డేంజర్
చాలా మంది పుచ్చకాయను తెచ్చుకున్న తర్వాత కట్ చేసి కొంత భాగం తింటారు. మరి కొంత ఫ్రిజ్‌లో పెడతారు. ఆ తర్వాత తినాలనిపించినప్పుడు మిగిలిన వారు తింటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటేనే మానేయండి. ఇలాంటి పుచ్చకాయ తినడానికి రుచిగా, చల్లగా ఉంటుంది. అయితే, ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది డాక్టర్ మీనాక్షి జైన్. ఆమె ప్రకారం ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తగ్గిపోతాయి. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది.
పోషకాలు నశిస్తాయి
పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచితే లైకోపీన్, సిట్రులిన్, విటమిన్ ఎ, విటమిన్ సి పరిమాణం తగ్గుతుందని డాక్టర్ మీనాక్షి జైన్ చెప్పారు. ఇది మాత్రమే కాదు, కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది ఫెక్షన్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అందులో చక్కెర పరిమాణం పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
వచ్చే సమస్యలు
- పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి
- చల్లని పుచ్చకాయ తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
- చల్లని పుచ్చకాయన తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది
- చల్లని పుచ్చకాయలో ఉంటే పేగుకు హాని కలిగిస్తుంది
- కడుపు సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గది గది బెస్ట్
కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టే బదులు గది ఉష్ణోగ్రత ఉంచాలని నిపుణులు భావిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే తింటే సరిపోతుందంటున్నారు. అదనంగా కట్ చేసిన పుచ్చకాయను రంధ్రాలు ఉన్న మూతతో కవర్ చేయాలనుకుంటున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని బయటి పొర చాలా మందపాటి తొక్కను కలిగి ఉంటుంది, దీని కారణంగా అది త్వరగా చెడిపోదు.
రాత్రి పూట తినకండి
పుచ్చకాయ చల్లని స్వభావం కలిగి ఉంటుంది. అయితే, రాత్రి పూట తినకూడదంటున్నారు నిపుణులు. రాత్రి పూట జీర్ణక్రియ మందగిస్తుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనితో, కడుపులో వారికి కలిగే అవకాశం ఉంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనితో మీ నిద్ర పాడయ్యే అవకాశం ఉంది.
0 Response to "Do you know what happens to eat watermelon in the fridge."
Post a Comment