Does anyone call 'be careful ..' Cut it into it.
ఎవరికైనా ఫోన్ చేస్తే 'జాగ్రత్తగా ఉండండి..' అనే యాడ్ వినిపిస్తోందా? దీన్ని ఇలా కట్ చేయండి.
జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని సమూహాల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వాళ్లు సైబర్ నేరగాళ్లు కావొచ్చు.. ఈ మ్యాటర్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా..
ఇటీవల ఎవరికి ఫోన్ చేద్దామన్నా కాలర్ ట్యూన్ కంటే ముందు వస్తున్న ప్రభుత్వ యాడ్ ఇది. ఈ యాడ్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ను ప్రజలకు అందించారు. అయితే అర్జెంట్ గా ఫోన్ చేయాల్సిన టైం లో ఇలాంటి యాడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తే కదా.. అలాంటప్పుడు ఈ యాడ్ ని రాకుండా చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సొసైటీలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకులు, పోలీసులు, వివిధ కంపెనీల పేర్లు చెప్పి మంచిగా మాట్లాడి అకౌంట్లలో డబ్బులన్నీ దోచేస్తున్నారు.
ఒక్కోసారి సిమ్ కనెక్షన్ ఇస్తున్నామని భయపెట్టి బ్యాంకు అకౌంట్ డీటైల్స్ తీసుకుంటున్నారు. నిమిషాల్లోనే ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. అప్ డేట్ అయిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలా అక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇవే కాకుండా వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫాం ల ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేసారు బెదిరిస్తూ మోసాలకు చేస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సెక్సువల్ హరాస్మెంట్స్ కి కూడా చూస్తున్నారు. ఇలాంటి మోసాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడానికే టెలికాం కంపెనీలు ఫోన్ రింగ్ అవ్వడానికి ముందుగా సైబర్ మోసాలను వివరిస్తూ యాడ్ వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ సమాచారం చాలా విలువైనది. అయితే అత్యవసరంగా ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యాడ్ వస్తే ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ యాడ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఫోన్ రింగ్ అవడం జరిగింది. అంటే సుమారు 20 సెకన్లు మీరు ఓపిగ్గా యాడ్ మొత్తం వినాల్సి ఉంటుంది. మామూలు టైం లో అయితే ఫర్లేదు కానీ అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ యాడ్ పదే వస్తోంది. ఇది ఒకరకంగా ఇబ్బంది పెట్టే విషయం. అందువల్ల మీరు ఈ యాడ్ ను కట్ చేయాలి అనుకుంటే ఈ చిన్న టెక్నిక్ ను ఫాలో అవ్వండి. ఈజీగా యాడ్ ఆగిపోతుంది.
ఈ సారి మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని సమూహాల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వాళ్లు సైబర్ నేరగాళ్లు కావొచ్చు.. అంటూ యాడ్ వస్తే వెంటనే ఫోన్ లో కీ ప్యాడ్ ఓపెన్ చేయండి. అందులో # కీపై క్లిక్ చేయండి. వెంటనే యాడ్ వాయిస్ ఆగిపోయి కాల్ రింగ్ అవడం జరిగింది. దీంతో వెంటనే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఇలా ఈ యాడ్ రాకుండా ఆపవచ్చు.
0 Response to "Does anyone call 'be careful ..' Cut it into it."
Post a Comment