Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Driving License Restoration: Your driving license has expired .. Let's find out how to do renewal ..

 డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసింది.. రెన్యూవల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

Driving License Restoration: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసింది.. రెన్యూవల్ ఎలా చేయాలో తెలుసుకుందాం..

ద్విచక్ర వాహనం నుంచి హెవీ వెహికిల్స్ వరకు ప్రతి ఒక్క వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి. డ్రైవింగ్ చేసేవారికి డ్రైవింగ్ లైసెన్స్ అత్యంత ముఖ్యమైనది అని చెప్పాలి.

ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లకూడదు. ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ముగిసిపోతే దానిని రెన్యువల్ ఎలా చేసుకోవాలో ఆన్‌లైన్ ప్రాసెసింగ్ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


డ్రైవింగ్ లైసెన్స్ వెంటనే ముగిసిన తరవాత దాన్ని రెన్యూవల్ చేయడం చాలా ముఖ్యం. మాములుగా డ్రైవింగ్ లైసెన్స్ కాలక్రమేణా గడువు ముగియడం సర్వసాధారణం. అలా గడువు ముగిసిన వెంటనే దానిని రెన్యూవల్ చేయడం ముఖ్యం. ఎక్కువ కాలం గడువు ముగియనివ్వడం వల్ల మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావచ్చు. దాంతో అనవసరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందట. అలాగే మీరు జరిమానా కూడా చెల్లించాల్సి రావొచ్చు. కాబట్టి మళ్ళీ కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెబుతున్నారు. ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ నిర్ణీత కాలానికి జారీ చేస్తారు. దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

కాబట్టి ఈ 30 రోజుల్లోపు పునరుద్ధరించుకుంటే రెన్యూవల్ చేసుకునేందుకు రుసుము రూ. 400 పడుతుందట. 30 రోజుల తర్వాత మీరు పునరుద్ధరించుకుంటే మీరు రూ.1500 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే భారత్ లో డ్రైవింగ్ లైసెన్స్ పరిమిత కాలానికి చెల్లుతుందట. ప్రారంభంలో డ్రైవింగ్ లైసెన్స్ 40 సంవత్సరాలు చెల్లుతుందని, ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దానిని పరిశీలించాలని సూచిస్తున్నారు. మీకు 50 ఏళ్లు నిండినప్పుడు పునరుద్ధరణ వ్యవధి 5 ​​సంవత్సరాలకు తగ్గింపు ఉంటుందట. మీరు చెల్లుబాటు గడువు ముగిసిన ఒక సంవత్సరం లోపు మీ లైసెన్స్‌ను పునరుద్ధరించకపోతే అది రద్దు అవుతుందట. డ్రైవింగ్ లో మీరు మళ్ళీ ఆఫీసులో తిరగాల్సిన పనిలేదు. ఈ పనిని మీరు ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చట.


ఆన్‌లైన్ ప్రాసెస్ విధానం విషయానికి వస్తే.. ముందుగా రవాణా శాఖ వెబ్‌సైట్‌ కి వెళ్ళాలి. మీరు మీ రాష్ట్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అప్లై ఆన్‌లైన్ పై క్లిక్ చేయాలి. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలపై క్లిక్ చేయాలి. ఆపై మీరు మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లోను ఎంచుకోండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన వివిధ సేవలతో కూడిన ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు దరఖాస్తు ఫారమ్ నింపాలి. మీ పుట్టిన తేదీ, లైసెన్స్ నంబర్, ఇతర అవసరమైన సమాచారం వంటి అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.

తరువాత పునరుద్ధరణ ఎంపికను ఎంచుకోవాలి. అందుబాటులో ఉన్న సేవల జాబితా నుండి రెన్యూవల్ కు సంబంధించి రెన్యూవల్ ఆప్షన్ ఉంటుంది. తరువాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీ ఇటీవలి ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. ఆపై ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాలి. రెన్యూవల్‌ రుసుము చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లో సులభంగా పునరుద్ధరించవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసే ముందు మీ వద్ద..గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మీ సంతకంతో ఫోటో, గుర్తింపు కార్డు, చిరునామా రుజువు లాంటి డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోవాలని చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Driving License Restoration: Your driving license has expired .. Let's find out how to do renewal .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0