Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Invest in this scheme when the girl is born

 SSY Scheme : ఆడపిల్ల పుట్టగానే ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. పెళ్లినాటికి రూ.70 లక్షలు చేతికి అందుతాయి.. ఫుల్ డిటెయిల్స్.

ఆడపిల్ల పుట్టగానే ప్రతి తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. వారికి మంచి చదువుతో పాటు మంచి కుటుంబానికి పెళ్లి చేసి పంపించాలని భావిస్తారు.

అయితే, కూతురు పుట్టినప్పుడే వారి కోసం డబ్బులు రూపాయి కూడబెడతారు.

ఆడపిల్ల ఎదిగే కొద్ది వారి చదువుకు లేదా పెళ్లినాటికి డబ్బులు చేతికి వస్తుందని అనుకుంటారు. అలాగే, మీరు కూడా మీ కుమార్తె 10 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉంటే.. మంచి ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకంలో పెట్టుబడితో మీ కలలను సాకారం చేసుకోవచ్చు.

ఈ గృహ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం తీసుకొచ్చింది. ఈ పథకం చాలా మంది తల్లిదండ్రులకు ఆశాకిరణంగా మారింది. మీరు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కుమార్తె పెళ్లినాటికి దాదాపు రూ.70 లక్షలు చేతికి అందుతాయి. మీకు మీ కూతురికి లేదా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు మీరు ఈ రూ. 70 లక్షల వరకు తీసుకోవచ్చు.

ఈ కుమార్తె పుట్టిన సమయంలో ఓపెన్ చేస్తే.. 21 ఏళ్లు నిండగానే పథకం ద్వారా మెచ్యురిటీ పొందవచ్చు. ఇంతకీ ఈ ఎస్ఎస్వై పథకం ఎలా పనిచేస్తుంది? ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి? ఎంత మొత్తంలో డబ్బు వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

SSY అకౌంట్ ప్రత్యేకతలివే 

  • ఈ పథకం కింద 10 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన ఆడపిల్లల పేరు మీద ఖాతా ఓపెన్ చేయొచ్చు.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో SSY ఖాతాలో కనీసం రూ.250 లేదా అంతకంటే ఎక్కువ రూ.1.5 లక్షలు జమ చేయొచ్చు.
  • ఈ ఖాతాకు 8.2 శాతం వడ్డీ వస్తుంది.
  • బ్యాంకులు, పోస్టాఫీసులలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
  • ఖాతా ఓపెన్ చేసిన 21 ఏళ్ల తర్వాత మెచ్యురిటీ పొందవచ్చు.
  • 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి చేయాలి.
  • ఈ అకౌంట్ దేశంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల మధ్య బదిలీలు పెట్టుకోవచ్చు.
  • SSY ఖాతా కింద వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను రహితం.
  • జమ చేసిన మొత్తం డబ్బుపై సెక్షన్ 80-C కింద మినహాయింపు పొందవచ్చు.

SSY పథకంలో ప్రత్యేకతలివే

సుకన్య సమృద్ధి యోజనలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అకౌంట్ 21 ఏళ్లుక మెచ్యురిటీ అవుతుంది. కానీ, ఈ పథకంలో 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మెచ్యురిటీ వరకు అనగా.. 21 సంవత్సరాల వరకు మొత్తం అమౌంటుపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది.

మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ఆదాయంపై పూర్తిగా పన్ను వర్తిస్తుంది. 3 అన్ని స్థాయిలలో పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు వార్షిక పెట్టుబడిపై మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత, పెట్టుబడిపై వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. మూడోది మెచ్యురిటీ సమయంలో వచ్చే డబ్బుపై కూడా పన్ను ఉండదు.

SSY కాలిక్యులేటర్ ప్రకారం.. మీకు ఎంత డబ్బు వస్తుందంటే? :

  • SSY అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం : 2025
  • అకౌంట్ మెచ్యురిటీ సంవత్సరం : 2046
  • ప్రస్తుత SSY వడ్డీ రేటు : సంవత్సరానికి 8.2 శాతం
  • ప్రతి నెలా పెట్టుబడి : రూ. 12,500 (వార్షిక పెట్టుబడి రూ. 1.50 లక్షలు)
  • 15 ఏళ్లలో పెట్టుబడి మొత్తం : రూ. 22,50,000
  • పెట్టుబడిపై మొత్తం వడ్డీ : రూ. 46,82,648
  • 21 ఏళ్లలో మెచ్యురిటీపై అందుకున్న మొత్తం : రూ. 69,32,648

మధ్యలోనే విత్డ్రా చేసుకోవచ్చా? 

సుకన్య సమృద్ధి యోజన పథకం కింద మీ కూతురికి 18 ఏళ్లు నిండాక పెళ్లికి 50 శాతం ఆమె విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా మీ డబ్బును విత్ డ్రా చేయొచ్చు. అకౌంట్ కలిగిన వ్యక్తి ఆకస్మిక మరణం, అమ్మాయి సంరక్షకుడి మరణం, ఖాతాదారుడికి తీవ్రమైన అనారోగ్యం వంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు తీసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Invest in this scheme when the girl is born"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0