Motivational
Motivational: ఎవరో ఏదో అన్నారని బాధపడుతున్నారా.? బుద్ధుడి కథ చదివితే మనసు ప్రశాంతమవుతుంది.
తన కోపమే తనకు శత్రువు అని చిన్నప్పుడు పద్యాలు చదువుకున్నాం. కానీ ఎంతటి ప్రశాంతమైన వ్యక్తికైనా సరే కోపం రావడం సర్వసాధారణం. అయితే కోపాన్ని ఎలా జయించాలో గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది.
ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో ఉండే ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండానే బుద్ధుడిని దూషిస్తాడు. అవమానిస్తాడు, నొటికొచ్చినట్లు తిడతాడు. అయితే బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా నవ్వుతాడు తప్ప. ఆ వ్యక్తిపై అస్సలు కోపం తెచ్చుకోడు.
దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. 'నేను నిన్ను ఇంతలా తిడుతున్నా? నీకు ఎందుకు కోపం రావడం లేదు. పైగా నవ్వుతున్నావు. నీకు ఏమైనా పిచ్చా.?' అని ప్రశ్నించాడు
దానికి బుద్ధుడు ప్రశాంతంగా బదులిస్తూ.. 'ఒక మనిషి ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తే, కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోకపోతే, ఆ బహుమతి ఎవరికి ఉంటుందో చెప్పండి?' అని అంటాడు. దానికి ఆ కోపిష్టి బదులిస్తూ.. "దాన్ని ఇచ్చినవాడికే ఉంటుంది." అని సమాధానం ఇస్తాడు
అప్పుడు బుద్ధుడు హాస్యంగా చెప్పాడు.. "నువ్వు నన్ను తిడితే, నేను దాన్ని స్వీకరించకపోతే, ఆ కోపం నీ దగ్గరే ఉండిపోతుంది' అని బదులిస్తాడు. కోపిష్టి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. నిజమే కదా అని ఆలోచనలో పడిపోతాడు.
నీతి: మన జీవితంలో రకరకాల మనుషులు ఎదురవుతారు. మన ప్రశాంతతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాటిని మనసుకు తీసుకోకుండా హాయిగా ఓ నవ్వు నవ్వేస్తే శత్రువులు కూడా మన జోలికి రావడానికి వెనుకడుగు వేస్తారు.
0 Response to "Motivational"
Post a Comment