NCL Recruitment 2025
NCL రిక్రూట్‌మెంట్ 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 10వ తరగతి పాస్ అయితే చాలు ఉద్యోగాలు
NCL Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ పదవ తరగతి పాస్ అయితే చాలు NCL లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి..
నిరుద్యోగులకు నార్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) వారు 1765 ఉద్యోగాలను విడుదల చేశారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్, మైనింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ వంటి విభాగాల్లో డిప్లమా కోర్సులు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత డిగ్రీ,డిప్లోమా,ఐటిఐ వంటి వాటిలో తప్పనిసరిగా అర్హత పొందాలి. అలా అర్హత పొందిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 01-03-2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
స్టైపెండ్ :
ఈ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్టైపెండ్ అనేది అన్ని పోస్టులకు ఒకే విధంగా ఉండదు. ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా స్టైపెండ్ ఉంటుంది . అయితే ఏ పోస్టుకు ఎంత స్టైపెండ్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.
ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ కు నెలకి రూ.7,000 నుండి రూ.8,050 రూపాయలు ఇస్తారు.
డిప్లొమా అప్రెంటిస్ కు నెలకి రూ.8,000 రూపాయలు ఇస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు నెలకి రూ.9,000 రూపాయలు ఇస్తారు.
ఎంపిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి పరీక్ష లేకుండా వారి విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపిక చేస్తారు. మీ విద్యా అర్హత పొందిన వెంటనే మీకు మంచి మార్కులు ఉంటే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.
ఆన్‌లైన్ దరఖాస్తు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే విధంగా NCL(నార్తన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్) అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం ద్వారా అప్లై చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు NCL వారి అధికారిక వెబ్ సైట్ నందు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: 18-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు
0 Response to "NCL Recruitment 2025 "
Post a Comment