Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Soak the kismis in the water at night and eat the morning in the water ..

 నానబెట్టిన ఎండుద్రాక్ష  రాత్రి పూట నీటిలో కిస్మిస్‌లను నానబెట్టి ఉదయం తినండి.. జరిగే అద్భుతాలను చూడగలరు.

కిస్మిస్‌ను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిలో తినండి..

కిస్మిస్.. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా అంటారు. వీటిని మనం తరచుగా తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తాం. ఖీర్, పాయసం, ఇతర స్వీట్లు తయారు చేసినప్పుడు కిస్మిస్‌లను వేస్తారు.

అయితే మనం వీటిని రోజూ నేరుగా కూడా తినవచ్చు. రోజూ రాత్రి పూట కిస్మిస్‌లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం కిస్మిస్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు. కిస్మిస్‌లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాటిని రక్షించడం. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని నివారించవచ్చు.

జీర్ణక్రియకు..

కిస్మిస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కిస్మిస్‌లలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీని వల్ల శరీర వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కిస్మిస్‌లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఉదయం కిస్మిస్‌లను తింటే ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు ఎంత పనిచేసినా అలసిపోరు.

బీపీ నియంత్రణకు.

కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. గుండెతో ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్, ఇతర గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. కిస్మిస్‌లలో క్యాల్షియం, బోరాన్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటే ఎముకలు దృఢంగా మారి ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీనితో వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియో పోరోసిస్ రాకుండా అడ్డుకోవచ్చు. కిస్మిస్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనితో చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. ముఖంలో కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.

రక్తహీనత తగ్గేందుకు.

కిస్మిస్‌లలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ తింటే శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.నీరసం, అలసట తగ్గుతాయి. కిస్మిస్‌లను తినడం వల్ల చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. డిప్రెషన్, వెంటనే ఒత్తిడి, ఆందోళన ఉన్నవారు కిస్మిస్‌లను తింటుంటే మూడ్ మారుతుంది. హ్యాపీ మూడ్‌లోకి వచ్చేస్తారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇలా నీటిలో నానబెట్టిన కిస్మిస్‌లను రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Soak the kismis in the water at night and eat the morning in the water .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0