Temples in India: These are the top 10 temples in India!
Temples in india: భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 దేవాలయాలు ఇవే!
భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రతి గుడికి ప్రత్యేక చరిత్ర, నిర్మాణం, ఆధ్యాత్మిక విలువలు ఉంటాయి. దేవాలయానికి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది.
మరి మన దేశంలో చూడదగిన టాప్ 10 ఆలయాలెంటో మీకు తెలుసా
గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ దేవాలయం చాలా ప్రత్యేకమైంది. ఇది శివుడి పురాతన దేవాలయం. 12 జ్యోతిర్లింగాల్లో ఇది మొదటిదని చెబుతారు. మహాశివుడి దర్శనానికి దూరప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ్ దేవాలయం శివుడికి చెందిన పవిత్ర దేవాలయాల్లో ఒకటి. ఇది వారణాసిలో ఉంది. చాలామంది భక్తులు ఏటా ఈ దేవాలయానికి వెళ్తుంటారు. ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లి రావాలను కోరుకుంటారు.
వైష్ణో దేవి దేవాలయం జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఏటా ఇక్కడికి చాలామంది వస్తుంటారు. కచ్చితంగా చూడాల్సిన దేవాలయాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తారు.
ఒడిశాలోని జగన్నాథ దేవాలయం రథయాత్రకు చాలా ఫేమస్. విష్ణువు అవతారమైన జగన్నాథుడికి చెందిన ఈ గుడికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
పంజాబ్ లోని స్వర్ణ మందిరం చాలా ప్రసిద్ధి గాంచింది. ఇది సిక్కుల పవిత్ర దేవాలయం. దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ ఉచిత భోజనం కూడా పెడతారు. తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్డెన్ టెంపుల్ ముందు వరుసలో ఉంటుంది.
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దేవాలయం హిమాలయాల్లో ఉన్న శివుడికి చెందిన యాత్రా స్థలం అంటారు. ఏటా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
తమిళనాడులోని బృహదేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచింది. ఇది యునెస్కో గుర్తింపు పొందింది. ఈ ఆలయాన్ని చోళులు కట్టించినట్లు చెబుతారు
తమిళనాడు రాష్ట్రంలోని మీనాక్షి దేవాలయం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఈ దేవాలయం వెగాయి నది ఒడ్డున ఉంది. 2500 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కచ్చితంగా చూడాల్సిన దేవాలయాల్లో తిరుపతి ముందువరుసలో ఉంటుంది.
బద్రీనాథ్ దేవాలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇది విష్ణుమూర్తికి చెందిన దేవాలయం. ఇది చార్ ధామ్ యాత్రలో ఒక భాగం.
0 Response to "Temples in India: These are the top 10 temples in India!"
Post a Comment