The new scheme from Ugadi in AP .. What P4, to whom the purpose and goal.
P4 Model : ఏపీలో ఉగాది నుంచి కొత్త పథకం.. ఏంటి P4, ఎవరికి ప్రయోజనం, లక్ష్యం ఏంటి.
ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టబోతున్న పీ4 ఉగాది పండగ రోజున ప్రారంభించబోతోంది.
వెలగపూడిలోని సచివాలయం వెనక భాగంలో భారీ సభ ద్వారా ఈ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
పీ4 విధానం ప్రారంభ సభకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది సమక్షంలో ఈ మొదలు పెట్టబోతున్నారు. 2029 నాటికి ఏపీలో పేదరికం నిర్మూలించాలి అనేదే సంకల్పంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ4 విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది ధనికులు అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకోవడంతో పాటు వారికి అండగా ఉంటూ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయడమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ రూపకల్పన చేశారు చంద్రబాబు.
పీ4 అమల్లో తొలుత గ్రామ, వార్డు సభల ద్వారా ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఈ సర్వేలో అత్యంత పేదల వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఈ సర్వే అంతిమ దశకు వచ్చినట్లుగా ఉంది. ఈ పీ4 విధానంలో లబ్ది పొందే కుటుంబాల జాబితాను ప్రభుత్వం రూపొందించబోతోంది. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. పీ4 విధానాలలో భాగస్వాములు కావడానికి ఎన్ఆర్ఐలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చని ప్రభుత్వం అందించింది. ఈ విధానం అమలులో అండగా నిలిచే వారికి మార్గదర్శక లబ్ది పొందే కుటుంబాలను బంగారు కుటుంబంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.
సమాజంలో ఉన్న ప్రజల ఆర్థిక అసమానతలను రూపుమాపటం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త శ్రీకారం చుట్టబోతోంది. ఉగాది పర్వదినాన ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. పీ4 విధానం పబ్లిక్- ప్రైవేట్- పీపుల్ పార్టనర్ షిప్ ద్వారా ఈ శ్రీకారం చుట్టబోతున్నారు.
సమాజంలో ఉన్న 10 శాతం మంది అత్యంత ధనవంతులు.. 20 శాతం మంది నిరుపేదలు.. వీరందరినీ సమన్వయం చేస్తూ పీ4 ప్రక్రియను ప్రారంభించారు. అమలు చేయబోతున్నారు. ముందుగా నాలుగు మండలాల్లో ఈ తరువాత అమలు చేయబడుతుంది. తర్వాత దశలవారిగా విస్తరించడం ద్వారా ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను నిరోధించడం కోసం ఈ కారణంగా చేపడుతున్నారు.
ఏంటి పీ-4? ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగనుంది..
- ఉగాది రోజున పీ4 విధానం అధికారిక ప్రారంభం
- భారీ బహిరంగ సభ ద్వారా పీ-4 విధానం ప్రారంభం
- 2029లోగా ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ-4 అమలు
- పేదలను దత్తత తీసుకోనున్న సంపన్నులు
- మొదటి గ్రామం, వార్డు స్థాయిలో అమలు
- తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
- ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం
- ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధికి దారి
- ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా స్వావలంబిగా మార్చేలా పీ4 విధానం
0 Response to "The new scheme from Ugadi in AP .. What P4, to whom the purpose and goal."
Post a Comment