Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

They are elixir for people with blood.

 Hemoglobin:బ్లడ్ తక్కువ ఉన్నవారికి ఇవి అమృతం.. రక్తం ఉరకలేస్తుంది.

emoglobin Count: ఏ సమస్య వచ్చినా సరే మనం ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా తగ్గించుకోవచ్చు. చాలా మందిలో రక్తహీనతా, హిమోగ్లోబిన్ లోపం వంటి సమస్యలతో సతమతమౌతుంటారు.

రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రక్తహీనత, హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వారు ఐరన్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవాలి.

మాంసం, పాలకూర, నట్స్ వంటి వాటిని ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిది. వీటిని తీసుకోవటం మల్ల హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ అందే ఆహారాన్ని తీసుకోవటం వల్ల విటమిన్ బి సమృద్ధిగా శరీరానికి అందుతుంది. ఎర్రరక్తకణాల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.

ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. హిమోగ్లోబిన్ తయారవ్వాలంటే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు గురించి తెలుసుకుందాం. .

ఇప్పుడు విరివిగా లభించే పుచ్చకాయను తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే పుచ్చకాయలో ఐరన్, విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. దానిమ్మలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన మన శరీరం ఐరన్ ని బాగా గ్రహించటానికి సహాయపడుతుంది. దానిమ్మను గింజల రూపంలోను లేదా జ్యూస్ రూపంలోను తీసుకోవచ్చు.

ఖర్జూరాలలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ప్రతి రోజు రెండు ఖర్జూరలను తింటే సరిపోతుంది. ఆప్రికాట్ లలో ఐరన్, విటమిన్ సి, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రతి రోజు ఒక అప్రికాట్ తింటే చాలు. ఎండు ద్రాక్షలో కూడా ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజుకి 6 ఎండుద్రాక్షను నేరుగా లేదా నానబెట్టి తినవచ్చు.

ఎండబెట్టిన టమాటాలలో ఐరన్, విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. మనం తిన్న ఆహార పదార్థాల నుండి ఐరన్‌ను మన శరీరం సంగ్రహించడంలో విటమిన్ సి చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఎండబెట్టిన టమాటాలు మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.

సాధారణంగా శరీరంలో హీమోగ్లోబిన్ ఎంత ఉండాలన్న విషయాన్ని పరిశీలిస్తే మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలలో్ 12 గ్రాములు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తక్కువగా ఉంటే రక్త హీనత సమస్య ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి.

రక్తహీనత సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే అది ఎన్నో రకాలుగా సమస్యలను తెచ్చి పెడుతుంది. కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు చేసుకుంటే ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

అంతేకాకుండా తాటి బెల్లం,గోధుమ గడ్డి,అటుకులు,కరివేపాకు,మునగాకు వంటి వాటిని ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్త హీనత సమస్య ఉండదు. రక్తహీనత కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "They are elixir for people with blood."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0