Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today, those who do not have God .. Harvard Scientist, including proof.

 ఇన్నాళ్లూ దేవుడు లేడన్న వాళ్లకి చెంప పెట్టు.. హార్వర్డ్ సైంటిస్ట్ రుజువుతో సహా చెప్పేశాడు.

Today, those who do not have God .. Harvard Scientist, including proof.

డాక్టర్ విల్లీ సూన్( Dr Willie Soon ) ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్ కూడా. ఆయన దేవుడు( God ) ఉన్నాడని బాగా నమ్మేస్తారు. రీసెంట్‌గా టక్కర్ కార్ల్‌సన్ నెట్‌వర్క్‌ ( Tucker Carlson Network ) కార్యక్రమంలో పాల్గొన్నారు.

అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఒక లెక్కల ఫార్ములా కూడా చూపించారు. ఆ ఫార్ములా చూస్తే ఎవరైనా దేవుడు ఉన్నాడని నమ్మాల్సిందే అంటున్నారాయన.

అసలు ఈయన వాదన ఏంటంటే, ఈ ప్రపంచం, ఈ విశ్వం( Universe ) అంతా ఏదో ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. భౌతిక శాస్త్ర నియమాలు కూడా అలాగే నడుస్తున్నాయి. అన్నీ కరెక్ట్‌గా సెట్ చేసినట్టు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఇవన్నీ జరగడం అస్సలు నమ్మశక్యంగా లేదు. అందుకే, కచ్చితంగా దీని వెనుక ఏదో ఒక శక్తి ఉంది, అదే దేవుడు అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. దీనికి ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన గణిత శాస్త్రవేత్త పాల్ డిరాక్ చెప్పిన ఒక ఫార్ములాను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ ఫార్ములా( Formula ) ప్రకారం కొన్ని ఖగోళ స్థిరాంకాలు చాలా కచ్చితంగా ఒకేలా ఉన్నాయి. సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం చెప్పలేకపోతున్నారు.

 పాల్ డిరాక్( Paul Dirac ) స్వయంగా 1963లోనే ఈ మిస్టరీ గురించి మాట్లాడారు. ప్రకృతి చాలా లోతైన, అందమైన, క్లిష్టమైన గణిత సూత్రాలను పాటిస్తుందని ఆయన అన్నారు. విశ్వం ఇలా ఎందుకు నిర్మించబడిందో అర్థం కావడం లేదని, దీన్ని మనం ఒప్పుకోక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, "దేవుడు గొప్ప గణిత శాస్త్రవేత్త అయి ఉంటాడు, అందుకే ఈ విశ్వాన్ని అంతా లెక్కలు వేసి క్రియేట్ చేసుంటాడు." అని కూడా ఆయన కామెంట్ చేశారు.

డాక్టర్ సూన్ కూడా ఇదే థియరీని పట్టుకుని దేవుడు ఉన్నాడని వాదిస్తున్నారు. మన విశ్వాన్ని నడిపే ప్రాథమిక శక్తులు దైవిక సృష్టికర్త ఉన్నాడని చెప్పడానికి సంకేతాలు అంటున్నారు. "దేవుడు మనకు ఈ వెలుగును ఇచ్చాడు, దాన్ని ఫాలో అవుతూ మనం చేయగలిగినంత మంచి చేయాలి" అని ఆయన చెప్పారు.

 సైన్స్, మతం రెండూ వేర్వేరు దారులు అని చాలామంది అంటారు. కానీ, గొప్ప సైంటిస్టులు కూడా ఇలాంటి ప్రశ్నలను అడగడం ఇదే మొదటిసారి కాదు. స్టీఫెన్ హాకింగ్( Stephen Hawking ) కూడా ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త, కానీ ఆయన మాత్రం దేవుడిని నమ్మలేదు.

హాకింగ్ తన చివరి పుస్తకం "బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్"లో దేవుడిపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు దివ్యాంగులను దేవుడు శపించాడు అనేవారు. కానీ, సైన్స్( Science ) ప్రతిదాన్ని సహజ సిద్ధమైన నియమాల ద్వారా వివరించగలదు అని హాకింగ్ నమ్మారు.

"మీకు కావాలంటే ప్రకృతి నియమాలే దేవుడి పని అని మీరు అనుకోవచ్చు. కానీ, అది దేవుడిని నిర్వచించడం వరకే పరిమితం అవుతుంది, అంతే కానీ ఆయన ఉన్నారని నిరూపించదు" అని హాకింగ్ అన్నారు.

స్వర్గం, నరకం లాంటివి కూడా లేవని హాకింగ్ కొట్టిపారేశారు. "మనం ఏమి నమ్మాలన్నా మన ఇష్టం. కానీ, నాకైతే దేవుడు లేడనే సింపుల్ లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు, మన భవిష్యత్తును ఎవరూ కంట్రోల్ చేయట్లేదు. స్వర్గం, నరకం లాంటివి కూడా ఉండకపోవచ్చు." అని ఆయన తేల్చి చెప్పారు.

మొత్తానికి డాక్టర్ సూన్, స్టీఫెన్ హాకింగ్ ఇద్దరూ రెండు వేర్వేరు అభిప్రాయాలను చెప్పారు. ఒకరు గణితంలోని అందం దేవుడికి నిదర్శనం అంటే, మరొకరు సైన్స్ మాత్రమే అన్నింటికీ సమాధానం అని నమ్మారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today, those who do not have God .. Harvard Scientist, including proof."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0