ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది - మే 20వ తేదీ వరకూ దరఖాస్తుకు గడువు - RGUKT IIIT ADMISSIONS 2025.
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ప్రకటన జారీచేసిన ఆర్జీయూకేటీ - జూన్ 5వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
RGUKT IIIT ADMISSIONS 2025: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ IIITల్లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. 2025-26 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి వివరాలను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు క్యాంపస్ డైరెక్టర్, ప్రవేశాల కన్వీనర్ సండ్ర అమరేంద్రకుమార్ వెల్లడించారు. ఈ సారి 2 నెలల ముందుగానే అప్లికేషన్ల పక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. RGUKT వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సెలక్ట్ అభ్యర్థుల జాబితాను జూన్ 5వ తేదీన విడుదల చేస్తామన్నారు. జూన్ 11వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జూన్ 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. పీహెచ్‌సీ, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీట్ల వివరాలు:ఒక్కో క్యాంపస్‌లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు మరో 100 ఉన్నాయి. మొత్తం 4 క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఫీజులు ఎంతంటే?: పీయూసీ (Pre-University Course)కి ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.45,000, ఇంజినీరింగ్‌కు ఏడాదికి రూ.50,000గా నిర్ణయించారు. తెలుగేతర రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అభ్యర్థులు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలి. PUC తరువాత ట్రిపుల్ ఐటీ నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం ఉంది.
నిబంధనలు వర్తిస్తాయి: అప్లికేషన్‌లో అభ్యర్థి మెరిట్ కేటగిరీ వారిచ్చిన ప్రాధాన్యం ప్రకారం క్యాంపస్ కేటాయిస్తారు. ఒకసారి క్యాంపస్ కేటాయించిన తరువాత బదిలీలు ఉండవు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ సబ్‌ప్లాన్ వర్గీకరణ ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. గతంలో మాదిరిగా సీటు దొరుకుతుందో లేదో అనుకుని వేరే కాలేజీలలో చేరి మళ్లీ ఇక్కడ సీటు వస్తే అక్కడ డబ్బులు వదులుకుని ఇక్కడకు రావడం వంటి ఇబ్బందులు పడే ప్రసక్తే ఉండదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ సారి ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని 17 జిల్లాలకు 65.62%, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 9 జిల్లాలకు 34.38% కేటాయించినట్లు అమరేంద్రకుమార్ చెప్పారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరణ: ఈ నెల 27 నుంచి మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు RGUKT వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.సెలక్టైన అభ్యర్థుల జాబితా విడుదల: జూన్ 5వ తేదీనసర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్: జూన్ 11వ తేదీ నుంచితరగతుల ప్రారంభం: జూన్ 30వ తేదీ నుంచి
0 Response to " "
Post a Comment