Baba Wanga has been talking about smartphones! What if the future is going to be according to her astrology
స్మార్ట్‌ఫోన్ల గురించి బాబా వంగా చెప్పిందే జరుగుతోంది! ఆమె జ్యోతిష్యం ప్రకారం భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే..?
2025లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని, 2043 నాటికి యూరప్‌లో ముస్లిం పాలన ఏర్పడుతుందని బాబా వంగా అంచనా వేశారు. ఆమె స్మార్ట్‌ఫోన్ వ్యసనం గురించి కూడా ముందే చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆమె అంచనాలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వంగా 2025వ ఏడాది గురించి పలు సంచలన విషయాలు అంచనా వేశారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా 1911 జనవరి 31న జన్మించారు. ఆమె బాల్యంలో తుఫాను కారణంగా తన కంటి చూపును కోల్పోయారు. అయినప్పటికీ, భవిష్యత్తు గురించి ఆశ్చర్యకరమైన అంచనాలు వేయడం ద్వారా ఆమె ప్రసిద్ధి చెందారు. పైగా ఆమె చెప్పిన అనేక విషయాలు నిజం అవుతుండటంతో చాలా మంది ఆమె జ్యోతిష్యాన్ని బలంగా విశ్వసిస్తారు. రాజకీయ తిరుగుబాట్ల నుండి ప్రకృతి వైపరీత్యాల వరకు బాబా వంగా చెప్పింది చెప్పినట్లు జరగడంతో ఆమెకు అంత పాపులారిటీ. అయితే.. బాబా వంగా చెప్పిన ఓ విషయం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అదేంటంటే.. స్మార్ట్ ఫోన్లకు మనుషులు బానిసలు అయిపోతారని, నిత్యం ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలకు అతుక్కుపోతారంటూ బాబా వంగా ఎప్పుడో అంచనా వేశారు.
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమె బతికిన్న కాలంలో, ఆమె ఈ విషయం గురించి చెప్పిన కాలంలో ఇంకా మొబైల్ ఫోన్ కనిపెట్టలేదు. అయినా కూడా ఆమె భవిష్య వాణిలో టెక్నాలజీ ఎలా మనిషిని తన బానిసలుగా మార్చకుంటుందో అంచనా వేశారు. ప్రస్తుతం మనమంతా ఫోన్లకు ఎలా అడిక్ట్ అయ్యామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్మ్‌ఫోన్ మన చేతికి 11వ వేలులా అయిపోయింది. కొన్ని నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. తింటున్నా, నడుస్తున్నా, చివరికి టాయిలెట్‌లో ఉన్నా కూడా ఫోన్ వాడేస్తున్నాం. ఈ ఫోన్ కారణంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి. వాటిని మనం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభవిస్తున్నాం.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) నివేదిక ప్రకారం, మన దేశంలో 24 శాతం మంది పిల్లలు నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దాదాపు 37 శాతం మంది పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైమ్ కారణంగా తమ చదువులపై దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు స్మార్ట్‌ఫోన్ల వల్ల కలుగుతాయని బాబా వంగా బతికున్నప్పుడే అంచనా వేశారు. వాటితో పాటు అత్యంత ఆందోళనకరమైన విషయం.. మూడవ ప్రపంచ యుద్ధం 2025లో ప్రారంభమవుతుందని, ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. 2043 నాటికి యూరప్‌లో ముస్లింల పాలన స్థాపించబడుతుందని కూడా ఆమె అంచనా వేశారు.
0 Response to "Baba Wanga has been talking about smartphones! What if the future is going to be according to her astrology"
Post a Comment