మంగు మచ్చలకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు.
మంగు మచ్చలను తగ్గించడానికి ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించవచ్చు. కలబంద, నిమ్మరసం, టమోటా, గ్రీన్ టీ, పాల ఉత్పత్తులు మంగు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
కలబంద గుజ్జును మచ్చలపై రాస్తే మంగు మచ్చలు తగ్గుతాయి. నిమ్మరసం, రోజ్ వాటర్, కీరదోస రసం, తేనె మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
టమోటా రసం, ముల్తాని మట్టి, గంధకం పొడి మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మచ్చలు తగ్గుతాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేయడం మరియు మంగు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. పాలు, వెన్న, ఎర్ర కందిపప్పు పౌడర్ వంటి పాల ఉత్పత్తులను రాస్తే మంగు మచ్చలు తగ్గుతాయి. ముల్తాని మట్టిని ఆవుపాలతో కలిపి మచ్చలపై రాయడం వల్ల మంగు మచ్చలు మాయమవుతాయి.
పసుపు, ఎర్రచందనం, పాలు, నెయ్యి మిశ్రమాన్ని మచ్చలపై రాయడం వల్ల మంగు మచ్చలు తగ్గుతాయి. జాజికాయను పాలలో అరగదీసి మచ్చలపై రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడా పేస్ట్‌ను మచ్చలపై రాయడం వల్ల మచ్చలు తేలికపడతాయి. క్రమం తప్పకుండా కలబంద గుజ్జున రాస్తే మంగు మచ్చలు మాటుమాయం. నిమ్మ, రోజ్‌వాటర్: ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి బాగా పట్టించి, 15, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజ్ వాటర్ లేని పక్షంలో నిమ్మరసాన్ని వాడుకోవచ్చు.
బంగాళ దుంపలపై ఉంటే తొక్కను తొలగించి సన్నగా తురమండి. దాన్ని పలచని గుడ్డలో వేసి రసం వచ్చేలా పిండండి. ఆ దూదిని ఆ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి
0 Response to " "
Post a Comment