Every father must say these things to his son. Avento description.
ప్రతి తండ్రి తన కొడుకుకు ఈ విషయాలు తప్పక చెప్పాలి. అవేంటో వివరణ.
అది తల్లిదండ్రులు పిల్లలను కన్న తర్వాత వారి బాగోగులు చూసుకోవడం తప్పనిసరి. నేటి కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని విషయాలను తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది.
అయితే ఎన్ని సమాజంలో ఉంటే మార్పులకు వారు మారినట్లు చెబుతున్నారు. అలా చెప్పడం వల్ల ఎప్పటికైనా ఆ విషయాలను గ్రహించి తన జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించుకుంటూ ఉంటారు. లేకుంటే వారు ఈ విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఎంత సంపాదించినా జీవితం అగౌమ్య గోచరంగా మారుతుంది. మరి తండ్రి కొడుకుకు నేర్పించాల్సిన 8 విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
రెస్పాన్సిబిలిటీ
ప్రతి వ్యక్తికి బాధ్యత తప్పనిసరిగా అవసరం. ఒక పనిని చేసినప్పుడు అది పూర్తి అయ్యేవరకు దాని వెంటే ఉండాలని తండ్రి చెబుతూ ఉండాలి. అలాగే కుటుంబ బాధ్యత కూడా తీసుకుంటూ ఉండాలని తండ్రి చెబుతూ ఉండాలి. ఉద్యోగంలో చేరిన సమయంలో కూడా ఒక పని పట్ల నిబద్ధత ఉండాలని తండ్రి చెబుతూ ఉండాలి. ఈ విషయాల పట్ల అవగాహన ఉంటే భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఉండవు.
మహిళలను గౌరవించడం
ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలను గౌరవించడం లేదు. అందుకు వారు పెరిగిన వాతావరణమే కారణం. ఒక కుటుంబంలో తండ్రి తన భార్యతో ప్రవర్తించిన తీరునే కొడుకులు ప్రవర్తిస్తున్నారు. అందువల్ల తాను మహిళను గౌరవిస్తూ తన కుమారుడికి కూడా గౌరవించాలని చెబుతూ ఉండాలి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివాహమైన తర్వాత కూడా మహిళలను గౌరవించాలని చెబుతూ ఉండాలి.
సమస్యల నుంచి బయటపడడం.
ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో ధైర్యంతో పాటు ప్రణాళిక కూడా తప్పనిసరి అని కొడుకుకు చెబుతూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో చాలామంది యువకులు కృంగిపోతూ ఉంటారు. వారికి సరైన అవగాహన లేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయాలు ఒక తండ్రి తన కుమారుడికి ముందే చెప్పడం వల్ల తనకు కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి తెచ్చుకొని.. లేదా ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో అనేది అవగాహన ఉంటుంది.
భావోద్వేగాలు
ప్రస్తుత సమాజంలో చాలామంది యువకులు భావోద్వేగాలను అర్థం చేసుకోవడం లేదు. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు? వారి మనస్తత్వం ఏంటి? అనే విషయాలను పరిశీలించాలని ఒక తండ్రి తన కుమారుడికి చెప్పాలి. అలా ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వారితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలి అంటే వాస్తవం తెలుసుకోవాలని పిల్లలకు చెబుతూ ఉండాలి. ఇలా చెప్పడం వల్ల భవిష్యత్తులో కుటుంబ బాధ్యతలు పెరిగి అందరితో సంతోషంగా ఉండగలుగుతారు.
బలం ఏంటో తెలుసుకోవడం.
చాలామంది యువకులు తమ శక్తి గురించి ఎక్కువగా తెలియదు. తానేంటో నిరూపించుకోవాలంటే తనకేది ఇష్టమో.. ఏ రంగంలో పనిచేయడం ఇష్టమో తెలుసుకోవాలని తమకుమారులకు గైడెన్స్ ఇస్తూ ఉండాలి. కొంతమంది అయోమయంలో పడి సరైన కెరీర్ ప్రణాళికను తీసుకోవడంలో విఫలమౌతూ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారికి సరైన మార్గాన్ని ఉంచుకొని ప్రయత్నం చేయాలి.
0 Response to "Every father must say these things to his son. Avento description."
Post a Comment