Google Pay: Do you know how to delete transactions on Google Pay?
Google Pay: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్స్ ఎలా డిలీట్ చేయాలో తెలుసా.?
యూపీఐ సేవల రాకతో ఆర్థిక లావాదేవీల తీరు పూర్తిగా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు వేరే వారికి డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లి, లైన్‌లో నిలబడి ఇలా పెద్ద తతంగం ఉండేది.
అయితే ప్రస్తుతం ఒక చిన్న క్లిక్‌తో ఒకరి ఖాతాలో నుంచి మరొకరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. గూగుల్‌పే, ఫోన్‌పే వంటి వాటికి ఆదరణ పెరిగిపోయింది. అయితే ఇలాంటి యాప్‌లలో మనకు తెలియని కొన్ని బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక మంచి ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మనం యూపీఐ యాప్ ద్వారా ఎవరెవరికి డబ్బులు పంపించాము. ఎక్కడెక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేశాననే వివరాలన్నీ ట్రాన్‌సాక్షన్ హిస్లో భద్రంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసిన లావాదేవీలు ఇతరులకు తెలియకూడదని భావిస్తాం. కానీ హిస్టరీలో ఉన్న మనం చేసిన ట్రాన్సాక్షన్ తాలుకూ వివరాలను డిలీట్ చేయడం సాధ్యం కాదు. అయితే గూగుల్ పేలో హిస్టరీని డిలీట్ చేసే అవకాశం ఉందని మీకు తెలుసా.? అదెలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్‌ను ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత ప్రొఫైల్‌లోకి వెళ్లి సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి
అనంతరం ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులో కనిపించే మొదటి ఆప్షన్ 'డేటా అండ్ పర్సనలైజేషన్' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
అనంతరం ఫస్ట్ లైన్‌లో కనిపించే గూగుల్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ మెయిల్ ఐడీ వివరాలతో గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి.
ఇలా లాగిన్ అయిన వెంటనే మీరు ఏ రోజు ఎక్కడెక్కడ పేమెంట్స్ చేశారో వివరాలు వస్తాయి. పక్కనే కనిపించే 'X' మార్క్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఉన్న వివరాలు డిలీట్ అవుతాయి.
గమనిక: ఈ ఆప్షన్ కేవలం గూగుల్ పేలో మాత్రమే అందుబాటులో ఉంది. ఫోన్ ఇలా ట్రానాక్షన్ వివరాలను డిలీట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఏమైనా వ్యక్తిగత లావాదేవీలు ఉంటే గూగుల్ పేలో చేసుకొని ఇలా డిలీట్ చేసుకోవచ్చన్నమాట.
0 Response to "Google Pay: Do you know how to delete transactions on Google Pay?"
Post a Comment