Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If Tatkal wants a ticket confirm you can log in

 తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే ఈటైంలో లాగిన్ అవ్వగలరు 

తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే మీరు లాగిన్ అవ్వవచ్చు.

తత్కాల్ టికెట్ కన్ఫర్మ్: భారత రైల్వే తత్కాల్ టికెట్ సర్వీస్ కూడా అందిస్తుంది. ఇది హఠాత్తుగా ప్రయాణాలు చేసే వారికి ఇది మాత్రమే వర్తిస్తుంది. ఈ తత్కాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

లేదా మొబైల్ యాప్ లో కూడా ఉంది. అయితే ఈ తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్ కూడా వెళ్లి చేసుకోవచ్చు. కానీ త్వరగా టికెట్లు బుక్ అయిపోతాయి. అయితే తత్కాల్ టికెట్స్ బుక్ సరైన సమయంలో ఉంది.

సాధారణంగా ఈ తత్కాల్ టికెట్ బుకింగ్ ఏసీ క్లాస్ ఉదయం 10 గంటలకు బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అదే స్లీపర్ క్లాస్ టికెట్ అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ప్రయాణికులు ఒకరోజు ముందుగా ఈ తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు రేపు ప్రయాణం చేస్తే ఈరోజు ఉదయం 10 లేదా 11 గంటలకు బుక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ టికెట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. అయితే ఎక్కువ శాతం మంది ఒకేసారి లాగిన్ అవ్వడంతో చాలామంది టికెట్లు అందుబాటులో ఉండవు. అయితే ఇది కాకుండా ప్రయాణికులు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల బుకింగ్ జరగదు. మీ టికెట్స్ కన్ఫర్మ్ కావాలంటే ఈ సమయంలో లాగిన్ అవ్వండి.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మీరు సరైన సమయంలో లాగిన్ అయితే మీ తత్కాల్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకవేళ ఆలస్యం చేస్తే ఐఆర్‌సీటీసీ సైట్‌లో మీరు లాగిన్ అయ్యేసరికి టికెట్స్ అన్నీ బుక్ అయిపోతాయి. సాధారణంగా ఈ టికెట్లు 5 నిమిషాల్లోపే బుక్ అయిపోతాయి. ఈ సందర్భంగా ఎక్కువ మంది ప్రయాణికులు టికెట్లు పొందలేరు. ఆ వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వస్తుంది. అయితే ఈ తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే సరైన సమయం ఏది ?

సాధారణంగా తత్కాల్ టికెట్ ఏసీ కోచ్ బుక్ చేసుకోవాలంటే ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంలో మీరు ఐఆర్‌సీసీ వెబ్‌సైటు లేదా యాప్‌లో ఉదయం 9:55 నిమిషాలకు లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే ఉదయం 10:55 కే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

అయితే చాలామందికి ఒక ఆలోచన వస్తుంది ఇక్కడే. ఆ సమయంలో అందరూ ఒకేసారి లాగిన్ అవుతారు కదా అని . అయితే దీనివల్ల ఇలా ముందు లాగిన్ అవ్వటం వల్ల లాగిన్ సమయం ఎక్స్‌పైరీ కూడా అయిపోతుంది. లావాదేవీలు నిర్వహించే వెబ్‌సైట్ యాప్ లేదా ఎక్స్‌పైరీ అయిపోతుంది . ముందుగా లాగిన్ చేయడం వల్ల ఒకవేళ మీరు 9:45 కి లాగిన్ చేస్తే 10గంటలకు


ఎక్స్‌పైరీ అయిపోతుంది. ఆ తర్వాత లాగిన్ అవ్వాలన్నా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మళ్లీ లాగిన్ చేయడానికి కూడా అంత ఈజీ కాదు. అందుకే మీరు సరిగ్గా తొమ్మిది 9:55 లేదా 10:55 మాత్రమే లాగిన్ చేయాలి. అంతకు ముందు లాగిన్ చేస్తే మాత్రం టికెట్లు పొందలేరు. ఈ సమయంలో మాత్రమే టికెట్ బుకింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ టిక్కెట్లు సాధారణ ధరల కంటే ఎక్కువగా ఉంటుంది. రీఫండ్ కూడా జరగదు కాబట్టి జాగ్రత్త వహించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If Tatkal wants a ticket confirm you can log in"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0