Inspiration
Government Jobs: ఒక్కడికే పది ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆ సీక్రెట్ చెప్పిన యువకుడు.
Government Jobs: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కొలువు సాధించడం అంత ఈజీ కాదు. ఒక ఉద్యోగం(JOB) వస్తే చాలు అనుకుంటుంటారు చాలా మంది. అందుకోసం చాలా కష్టపడతారు.
రోజుకు 10 నుంచి 15 గంటలు చదువుతారు. అయినా కొందరికే ప్రభుత్వ కొలువులు వస్తాయి. కానీ, ఇక్కడ ఓ యువకుడు ఏకంగా పది ప్రభుత్వ కొలువులు కొట్టేశాడు. తాజాగా గ్రూప్-1లోనూ సత్తా చాటాడు. జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli(జిల్లాలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన యువకుడు గోపీ కృష్ణ పది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గోపీ కృష్ణ(Gopi Krishna) తన కఠోర శ్రమ, అంకితభావంతో ఒకటి, రెండు కాదు, ఏకంగా పది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.
సాధించిన ఉద్యోగాలు..
గోపీకృష్ణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 వంటి వివిధ స్థాయిల్లోని పోస్టులు, అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలు సాధించాడు. ఈ ఉద్యోగాలన్నీ ఒకేసారి కాకుండా వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల ద్వారా అతను సాధించినట్లు తెలుస్తోంది.
సీక్రెట్ ఇదే..
గోపీ కృష్ణ తన విజయ రహస్యం కూడా చెప్పాడు. తాజాగా గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన నేపథ్యంలో తన సక్సెస్ సీక్రెట్‌ను వెల్లడించాడు. ఈ విజయాన్ని సాధించడానికి రోజూ 10-12 గంటలు చదువుకున్నాడని, తన లక్ష్యాలను చేరుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేశానని తెలిపాడు. ఈ సాధన గుంటూరుపల్లి గ్రామంలోనే కాక, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అతని ఈ విజయం గురించి తెలిసిన స్థానిక ప్రజలు, అధికారులు అతన్ని అభినందిస్తూ, ఇది ఒక అద్భుతమైన నమూనాగా చెబుతున్నారు.
0 Response to "Inspiration"
Post a Comment