Petrol Price Hike
Petrol Price Hike: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్ పై మరో రూ.2 పెరిగింది. ఏప్రిల్ 7 అర్థరాత్రి నుంచి ధరలు అమల్లోకి రాగా కొత్తవి.
పెరిగిన ధరలు కంపెనీలే భరిస్తాయని, సామాన్యుడిమీద భారం పడదని స్పష్టం చేసింది.
భారం కంపెనీలే భరిస్తాయి..
ఈ మేరకు ప్రస్తుతం హైదరాబాద్‌లో 107.46 పైసలు ఉన్న పెట్రోలు ధరతో 107.46 పైసలు పెరిగాయి. ఇక డీజిల్ ప్రస్తుతం 97.70 పైసలుండగా పెరిగిన ధరతో 99.70 పైసలు. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 108, 107 రూపాయలు కొనసాగుతోంది. అయితే ఈ పెరిగిన ధరలతో సామాన్యుడిపై ఎలాంటి భారం పడదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇతర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ ముడి చమురు ధర 15 శాతం తగ్గింది. ప్రస్తుతం 1 బ్యారెల్ ముడి చమురు ధర $63.34గా ఉంది. ఇది అత్యల్ప స్థాయిలో చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో, దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే కంపెనీల లాభాలు పెరిగాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు పెట్రోల్ ,డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచినట్లు తెలుస్తోంది.
0 Response to "Petrol Price Hike"
Post a Comment